బడ్జెట్ 2025: వేటి ధరలు తగ్గబోతున్నాయి.. వేటి ధరలు పెరగబోతున్నాయి..
వరుసగా ఎనిమిదవసారి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను టెన్షన్ పెట్టిన ట్యాక్స్ నుంచి భారీ స్థాయి ఉపశమనాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కీలక మార్పులు చేశారు నిర్మలా. 2025-26 వార్షిక బడ్జెట్ తరువాత కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరగడం..
వరుసగా ఎనిమిదవసారి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను టెన్షన్ పెట్టిన ట్యాక్స్ నుంచి భారీ స్థాయి ఉపశమనాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కీలక మార్పులు చేశారు నిర్మలా. 2025-26 వార్షిక బడ్జెట్ తరువాత కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరగడం.. కొన్న వస్తుల రేట్లు భారీగా తగ్గడం జరుగుతుంది. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ విద్య, వ్యవసాయం దగ్గర నుంచి టెక్నాలజీ రంగాల వరకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. అదే సమయంలో మధ్య తరగతితో పాటు వేతన జీవులను గుడ్‌న్యూస్ అందించారు. ఈ బడ్జెట్‌లో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి ? వేటి ధరలు పెరగనున్నాయి ? అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాణాలను కాపాడే 36 రకాల మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. దీంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన 3 ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.
ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌లో వినియోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ తుక్కుతో పాటు.. జింక్ సహా మరో 12 రకాల క్రిటికల్ మినరల్స్‌ను కూడా కస్టమ్స్ ట్యాక్స్ నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీద కస్టమ్స్ డ్యూటీని 10 ఏళ్ల పాటు మినహాయింపు ఇచ్చింది సర్కారు. సముద్ర ఉత్పత్తుల మీద బేసిక్ కస్టమ్ డ్యూటీని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది ప్రభుత్వం. తోలుతో పాటు తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి.ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల రేట్లు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లూ భారీగా తగ్గనున్నాయి. ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్‌కు సంబంధించిన ధరలు కూడా ఈ బడ్జెట్ తరువాత తగ్గుతాయి. మన దేశంలో తయారయ్యే బట్టల ధరలు ఇక తక్కువ ధరకు లభించబోతున్నాయి.
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లతో పాటు మరో 12 రకాల కీలకమైన ఖనిజాల రేట్లు కూడా తగ్గుతాయి.వీటితో పాటు బడ్జెట్ ఎఫెక్ట్‌తో కొన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే మీద ట్యాక్స్‌ను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వ. దీంతో టీవీల రేట్లు పెరిగే చాన్స్ ఉంది. దేశీయంగా టెక్స్‌టైల్ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేందుకు అల్లికల దుస్తుల మీద కస్టమ్స్ పన్నును 10 నుంచి 20 శాతానికి పెంచారు. దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవల ధరలు పెరగనున్నాయి. పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇంపోర్టెడ్ చెప్పుల ధరలు కూడా పెరుగుతాయి.
స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల ధరలు కూడా పెరగనున్నాయి. ఓవరాల్‌గా గత బడ్జెట్‌తో కంపేర్ చేస్తే ఈ సారి బడ్జెట్ మిడిల్‌క్లాస్‌కు ఫ్రెండ్లీగా ఉందని నిపుణులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కం ట్యాక్స్ విషయంలో రిబెట్‌ను పెంచడంపై దేశవ్యాప్తంగా మిడిల్‌క్లాస్ పీపుల్, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ట్యాక్స్ విషయంలో నిర్మాల సీతారామన్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంతా అన్నం తింటే ఈవిడ మాత్రం మన శాలరీలు తింటోందంటూ చాలా మంది ఎంప్లాయిస్ మీమ్స్ కూడా వైరల్ చేశారు. ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త స్లాబ్స్‌తో తన హేటర్స్ అందరినీ ఫ్యాన్స్‌గా మార్చుకుంది మన ఫైనాన్స్ మినిస్టర్.