రేవంత్ దెబ్బకు సైలెంటైన బన్నీ ఆర్మీ… గేమ్ చేంజర్ ను కెలకట్లే…
మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు దాదాపుగా రెండు మూడు ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో వార్ విచ్చలవిడిగా జరుగుతోంది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి రావడాన్ని జీర్ణించుకోలేకపోయినా మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు.
మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు దాదాపుగా రెండు మూడు ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో వార్ విచ్చలవిడిగా జరుగుతోంది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి రావడాన్ని జీర్ణించుకోలేకపోయినా మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. పదేపదే పుష్ప పార్ట్ 2 సినిమాను కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ కావడాన్ని కూడా ఇప్పుడు మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
అందుకే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మాత్రం ఆగలేదు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం అల్లు అర్జున్ అభిమానులు సైలెంట్ గా ఉండిపోయారు. కచ్చితంగా ట్రోల్ చేసే ఛాన్స్ ఉందని ఊహించారు అందరూ. కారణం ఏంటి అనేది తెలియకపోయినా ట్రైలర్ ను మాత్రం ట్రోల్ చేయడానికి అసలు ఇష్టపడలేదు. అటు నందమూరి అభిమానులు కూడా పెద్దగా ట్రోల్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఒకటి రెండు ఫోటోలుతో కొంతమంది హడావుడి చేసినా… పెద్దగా సోషల్ మీడియాలో కంగారు పడే ట్రోలింగ్ కనబడలేదు.
పుష్ప పార్ట్ 2 సినిమాకు అలాగే దేవర సినిమాకు ట్రోలింగ్ నిర్మాతలను కంగారు పెట్టింది. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం అది పెద్దగా కనపడటం లేదని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన అభిమానులను కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరించారు. దీనితో అల్లు అర్జున్ కు సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ లు తక్కువగా కనబడుతున్నాయి.
ఇక అల్లు అర్జున్ వ్యవహారంతో కాస్త డైలమాలో ఉన్న అతని ఫాన్స్ గేమ్ చేంజెస్ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. ఒక రకంగా పుష్ప సినిమా గోదావరి జిల్లాలో వసూళ్లు తగ్గడానికి మెగా ఫాన్స్ కారణం. అలాగే హైదరాబాదులో కూడా కొన్ని ఏరియాస్ లో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. దీనికి కూడా మెగా ఫాన్స్ ప్రభావమే అనేది చాలామంది నుంచి వినపడుతున్న మాట. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవిని కలిసిన సరే మెగా అభిమానులు మాత్రం శాంతించలేదు. చాలామంది సినిమా చూడటానికి కూడా అసలు ఇష్టపడలేదు. దానికి తోడు జనసేన కార్యకర్తలు కూడా పుష్ప సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు సైలెంట్ గా కనబడుతున్నారు. అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకు అనే భయం కూడా వారిలో ఎక్కువగా ఉంది. మరి సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో వారి నుంచి రియాక్షన్ ఉంటుందో లేదో చూడాలి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఫోకస్ చేసినట్లు కనపడలేదు.