ఏపీ రాజ్యసభ లెక్కలు ఇవే, నాగబాబుకు ఇచ్చినా ఏడాదే
ఏపీలో మూడు రాజ్యసభ స్ధానాలకు ఉప ఎన్నికలు ఎలక్షన్లు జరగాల్సి ఉంది.... ఇప్పటికే రెండు స్ధానాలకు అభ్యర్ధులు పాత వాళ్లే. మిగిలిన ఒక్క స్ధానానికి కూడా రకరకాల పేర్లు వినపడినా.. ఫైనల్ గా టిడిపి నేత సానా సతీష్ కె దక్కింది.
ఏపీలో మూడు రాజ్యసభ స్ధానాలకు ఉప ఎన్నికలు ఎలక్షన్లు జరగాల్సి ఉంది…. ఇప్పటికే రెండు స్ధానాలకు అభ్యర్ధులు పాత వాళ్లే. మిగిలిన ఒక్క స్ధానానికి కూడా రకరకాల పేర్లు వినపడినా.. ఫైనల్ గా టిడిపి నేత సానా సతీష్ కె దక్కింది. ముగ్గురు అభ్యర్ధులుగా, బిజెపి నుంచీ ఆర్.కృష్ణయ్య, టిడిపికి లో చేరిన బీదా మస్తాన్ రావు, టిడిపి నుంచే మరో అభ్యర్ధి సానా సతీష్.. ఫైనల్ అయిపోయారు
బీదా మస్తాన్ రావు.. గత వైసిపి ప్రభుత్వం లో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచీ జంప్ చేసి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు… అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్ధానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారారు. యాదవ కులస్తుడైన బీదా మస్తాన్ రావు 2009లో కావలి నుంచీ ఎంఎల్ఏ గా గెలిచి ఆ తరువాత రెండు సార్లు ఓడిపోయారు. క్రియాశీలక రాజకీయాల కు దూరంగా ఉన్న బిదా మస్తాన్ రావును 2022 లో వైసీపీ నుంచీ రాజ్యసభకు పంపించారు… ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ కు కూడా బీదా మస్తాన్ రావు రాజీనామా చేసారు.. అయితే టిడిపి నుంచీ బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టిడిపి తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ఛయించుకున్నారు. టిడిపిలో చేరి తన ఎంపీ సీటు తానే రాబట్టుకోవడానికి పార్టీకి భారీగానే చెల్లించారట మస్తాన్ రావు.
ఆర్.కృష్ణయ్య తెలంగాణా వాడైనప్పటికీ అతన్ని రాజ్యసభకు పంపించింది వైసీపి . కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఏపీకి ఏ సంబంధం లేని కృష్ణయ్యను, పార్టీతో ఎటువంటి లింకు లేని నాయకుడిని రాజ్యసభకు ఎంపిక చేయటం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఇవన్నీ లెక్క చేయలేదు. బిసి నాయకు డైన కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తే ఏపీలో బీసీలు ఓట్లన్నీ వైసీపీకి పడిపోతాయని ఆశపడ్డాడు. జగన్ కి బీసీలు దెబ్బ వేస్తే ఎన్నికల తర్వాత కృష్ణయ్య దెబ్బ వేశాడు. 2014లో టిడిపి తరఫున ఎల్బీ నగర్ నుంచీ పోటీ చేసి గెలిచాడు.. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభకు పంపించింది.. ఇటీవల ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బిసి ఉద్యమ నాయకుడు కావడం.. బిజెపికి బిసిలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు…. అలాగే బిజెపి రాబోయే కాలంలో క్షేత్రస్ధాయిలో బలపడాలంటే సామాజికవర్గ సమీకరణాలను పూర్తిగా స్వంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దీనిలో బీసీలలో బిజెపి ని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బిజెపి కండువా కప్పారు. బిసి కార్డు మరోసారి కృష్ణయ్యకు ఉపయోగపడింది.
మిగిలిన మూడో స్ధానం కాలపరిమితి ఒకటిన్నర సంవత్సరమే ఉండటంతో, ఆశావహులు కూడా తక్కువే .ఇప్పటికే కాకినాడ ఎంపి సీటు ఆశించి వదులుకున్న సానా సతీష్ కు కచ్చితంగా ఏదో ఒక అవకాశం ఇస్తామని పార్టీ ప్రామిస్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో సాన సతీష్ పార్టీ కోసం ఆర్థికంగానే కాక, మిగిలిన అన్ని వ్యవహారాల్లో గట్టిగా పని చేశారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సానాకు పోటీ వచ్చినప్పటికీ…. లోకేష్ పట్టుబట్టి సానా కి రాజ్యసభ సీటు ఇప్పించారు ఏదేమైనా… ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కావడంతో ఏపీ నుంచీ ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం కానున్నాయి. బిజెపి తరఫున కృష్ణయ్య, టిడిపి అభ్యర్థులుగా.. బీద మస్తాన్ రావు, సనా సతీష్ లో ఖాతా తెరవబోతున్నారు.