గోవా కంటే చీప్, ఏపీ మందు బాబులకు హ్యాపీడేస్
ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై ప్రభుత్వం నేడు కేబినేట్ లో ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై ప్రభుత్వం నేడు కేబినేట్ లో ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుండి ఈ నూతన పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటారు. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం – 1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నూతన మద్యం పాలసీ లో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విదానాన్ని అనుసరించాలని కేబినేట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుందని దీని ద్వారా… రిటైలర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఏపీలో తాజా ధరల ప్రకారం చూస్తే కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా కంటే మద్యం చీప్ అనేది స్పష్టమవుతుంది. గోవాలో మద్యం మినిమం ధర 100 రూపాయలు కాగా ఏపీలో 99 రూపాయలే. ప్రస్తుతం రూ.147 గా ఉన్న సగటు మద్యం ధరను రూ.99నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కంటే ఏపీలో మద్యం తక్కువ కావడం పట్ల మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల మద్యం కోసం ఎదురు చూసామని ఇప్పుడు ఏపీలో అన్ని బ్రాండ్ లు దొరికి, నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటం సంతోషంగా ఉంది అంటున్నారు.
ఇక రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండేందుకై లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు పద్దతిని అనుసరించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని అలాగే… అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేబినేట్ సమావేశం సందర్భంగా ఆదేశించారు.