ఈ నెలాఖరున కేబినెట్ విస్తరణ మళ్లీ రెడ్లకే పెద్ద పీట…!
ఎన్నాళ్లుగానో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 28 లేదా 29 న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది.

ఎన్నాళ్లుగానో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది.
ఈనెల 28 లేదా 29 న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. ఎప్పటిలాగే కుల సమీకరణాలు బలంగా పనిచేస్తున్నాయి. ఢిల్లీలో హై కమాండ్ దగ్గర కాంగ్రెస్ వర్గాలన్నీ తమ మనిషికి మంత్రి పదవి ఇప్పించుకోవడానికి రకరకాల పైరవీలు నడిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్న పూర్తిస్థాయి మంత్రివర్గం ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవలసి ఉండటంతో మంత్రివర్గ విస్తరణ చేసి, ఎన్నికలకు సిద్ధపడాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసింది.తెలంగాణ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి చాలా రోజులుగా కసరత్తు జరుగుతుంది. వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణ.. కి త్వరలోనే మోక్షం కలగబోతుంది. మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఉగాదికి ఒక రోజు ముందు కానీ…తర్వాత కానీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
డిల్లీలో కేసీ వేణుగోపాల్ తో.. సిఎం రేవంత్..డిప్యూటీ సిఎం భట్టి.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. రకరకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు.కేబినెట్ లో ఆరు మంత్రి పదవుల భర్తీ చేసే వెసులు బాటు ఉంది. ఐతే… దీంట్లో ఐదు పదవులను ఇప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది. ఐదు పదవుల్లో సామాజిక కూర్పు లాంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి కాబోతున్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కనుంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు రేవంత్ క్యాబినెట్లో మంత్రులుగా ఉంటారు. రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి కాంగ్రెస్ కి వచ్చే సమయంలో అతనికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చింది. అయితే రెడ్లకు రెండు మంత్రి పదవులు ఇస్తారా..? దానివల్ల కొత్త సమస్యలు వస్తాయా అనేది చూడాలి. దీనికి తోడు నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గం కి చెందిన వారే. అదే కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కూడా ఛాన్స్ దక్కుతుందా ..? అనే చర్చ కూడా ఉంది. కానీ కేసీ వేణుగోపాల్ రాజగోపాల్ రెడ్డి కి మాట ఇచ్చారు కాబట్టి అది అమలులోకి వస్తుందన్న ధీమా కూడా రాజగోపాల్ రెడ్డి లో ఉంది. ఇక మైనార్టీ కోటా లో మంత్రి పదవి కూడా భర్తీ చేయబోతుంది.
శాసనమండలిలో సభ్యుడు అమీర్ అలీఖాన్ పేరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచించినట్టు తెలుస్తుంది. ఇక వివేక్ వెంకటస్వామి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాదిగలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నందున…మాలలకు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఐతే వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనతో మరో వెలమ, కామారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రాకుండా పోటీలో ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారు అయ్యింది. సామాజిక సమీకరణాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నప్పటికీ… వీటన్నింటిపై అధిష్టానం తో చర్చించి పరిష్కరించాలని చూస్తున్నారు. మంత్రి పదవికి దేవరకొండ ఎంఎల్ఏ బాలు నాయక్.. కూడా రేసులో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఐదులో రెండు రెడ్డిలకు ఇస్తే.. ఒక ఎస్సీ, ఒక ఎస్ టి, ఒక బీసీ, చివరిది వెలమకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆరు మంత్రి పదవుల్లో ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే… వెలమలకు ఈసారి ప్రాధాన్యం దక్కక పోవచ్చు. మొత్తం మీద చాలా రోజులు సస్పెన్స్ కి ఈనెల 28 లేదా 29 తో తెరదించబోతోంది కాంగ్రెస్ ఐ కమాండ్.