YS Sharmila: షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు.. పొత్తులా? విలీనమా?
వైస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 2010 లో కాంగ్రెస్ ని వీడిన తరవాత మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ ని కలవడం ఇదే మొదటి సారి. సోదరుడు జగన్ తో విభేధాలు.. ఆ తరవాత తెలంగాణ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం.. పాదయాత్ర ఈ పరిణామాల మధ్య షర్మిళ కాంగ్రెస్ హైకమాండ్ కలయిక కు ప్రాధాన్యం ఏర్పడింది.
షర్మిళ ను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయమని కోరినట్లు సమాచారం. ఐతే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం చెప్పలేనని షర్మిల హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. షర్మిలకు ఆర్థిక సమస్యలు ఏమి లేవు. పార్టీ ని నడపగలిగే డబ్బు ఉంది. కాకపోతే చుట్టూ బలమైన కార్యవర్గం కానీ.. ఆమెని శక్తివంతమైన నాయకురాలిగా నిలబెట్టే సెకండ్ క్యాడర్ నాయకులు కానీ లేరు. ఏ పూటకు ఆ పూట కూలి ఇచ్చి పని చేయించుకోవడమే. పాదయాత్ర చేసినా పెద్ద పేరు రాలేదు. వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక వివాదం లేపి ప్రచారం ఆశించినంతగా రాలేదు. షర్మిల చుట్టూ చేరిన వాళ్ళు ఏ రోజు కా రోజు ఎంతో కొంత పిండుకుందాం అనుకునే వాళ్ళే తప్పా.. ఒక వ్యూహం ప్రకారం ఆమెని నడిపించే వాళ్ళు లేరు. దీంతో రోజు రోజు కు ఆమె పొలిటికల్ గా వీక్ అవుతున్నారు.
షర్మిల కేసీర్ ని నాలుగు తిట్టడానికి పనికి వస్తుందే తప్ప అంతకన్నా ఉపయోగం లేదని బీజేపీ కూడా గుర్తించింది.పైగా క్రిస్టియన్ ఐన షర్మిల తో ఎన్నికల ఒప్పందం అసలుకే మోసం తెస్తుందా.. హిందుత్వ శక్తుల ఆగ్రహానికి గురి అవడం అవసరమా అని పార్టీ లో చర్చ జరుగుతోంది. TSPSC పేపర్ లీక్ వ్యవహారం లో కలసి పోరాడదాం అని షర్మిల బీజేపీ కి, కాంగ్రెస్ కి లేఖలు రాసిన వాళ్ళు రాలేమని దండం పెట్టేసారు. తమని అడ్డం పెట్టుకుని షర్మిల క్రెడిట్ కొట్టేస్తుందేమోననే అనుమానం రేవంత్, బండి సంజయ్ లకు లేకపోలేదు. అందుకే షర్మిళ ఆఫర్ ని తిరస్కరించారు. ప్రతి అడుగు లోను తాను ప్రచారం పొందాలనే షర్మిల వ్యూహాన్ని వాళ్ళు గుర్తించారు. అందుకే దూరంగా ఉన్నారు.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం చాలా ఖర్చు తో కూడుకున్న పని. ఇంత హెవీ పొలిటికల్ వార్ లో తనకు అడ్రెస్ దొరుకుతుందా అన్నది కూడా డౌటే. అందుకే షర్మిల సిగ్నల్స్ ఇస్తున్నారు. దీనిని గమనించి కాంగ్రెస్ హైకమాండ్ కబురు పెట్టింది. కాకపోతే పార్టీని విలీనం చేయాలని మెలిక పెట్టింది. షర్మిల కు నిజంగానే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందా అని రాజకీయ వర్గాల్లో సందేహం లేకపోలేదు.
గతం లో షర్మిలకు మోడీ ఫోన్ చేశారని.. యోగ క్షేమాలు అడిగారని ప్రచారం జరిగింది. ఆ తరవాత అది ఫేక్ అని తెలిసింది. ఆ తరవాత షర్మిల కు ఎందుకు అన్యాయం చేశావని.. ప్రధాని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కడిగి పారేశారని కూడా మరో ప్రచారం వచ్చింది. అదీకూడా పెయిడ్ ప్రచారం అని తేలింది. ఈ మద్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి షర్మిల పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేశారు. అసలు పొంగులేటి షర్మిల తో ఎందుకు కలుస్తారు.. కలసి ఎమ్ చేస్తారని అందరికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆఫర్ కూడా షర్మిల పార్టీ ప్రచారమేనా.. అసలు నిజముందా అనే సందేహం కూడా అందరిలో వస్తుంది.