వాటర్ బిల్ కట్టలేదా…? హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని హైదరబాద్ జలమండలి తీసుకొచ్చింది. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించొచ్చు అని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు.

పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని హైదరబాద్ జలమండలి తీసుకొచ్చింది. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించొచ్చు అని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు. జలమండలి లో నీటి బకాయిలు పెరుగుతుండటంతో వన్ టైమ్ సెటిల్మెంట్ తీసుకొచ్చింది. అక్టోబర్ ఎండింగ్ వరకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం వర్తిస్తుంది.
గతంలో 2016, 2020 లో వన్ టైమ్ సెటిల్మెంట్ తీసుకు వచ్చారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే భవిష్యత్ లో రెండేళ్లపాటు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.