Maadhavi Latha: మాధవీలతకు మరో షాక్..
మాధవీలతపై బేగంబజార్ పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిరోజుల కింద మాధవీలత వివాదాస్పద వీడియో ఒకటి వైరల్ అయింది. శ్రీరామనవమి శోభాయాత్ర రోజు ఆమె వ్యవహరించిన తీరు.. దుమారానికి దారి తీసింది.
Maadhavi Latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. బీజేపీ బీఫామ్ ఎందుకు ఇవ్వలేదన్న చర్చ జరుగుతున్న సమయంలోనే.. ప్రచారంలో ఆమె చేసిన పని.. కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మాధవీలతపై బేగంబజార్ పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిరోజుల కింద మాధవీలత వివాదాస్పద వీడియో ఒకటి వైరల్ అయింది.
Telangana Politics : రేవంత్ పిలిచినా ఎవరూ రావట్లే.. ఎన్నికల తర్వాతే ఎవరైనా…
శ్రీరామనవమి శోభాయాత్ర రోజు ఆమె వ్యవహరించిన తీరు.. దుమారానికి దారి తీసింది. హైదరాబాద్ పాతబస్తీ సిద్ధి అంబర్ బజార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో.. మాధవీలత ఓ మసీదుపైకి విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లుగా ఫోజు ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఆమెకు ఇబ్బందులు తీసుకువచ్చింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాధవీలత వ్యవహరించిందంటూ.. ఓ వ్యక్తి బేగంబజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఐతే ఈ కేసుపై.. తన మార్క్ ఆన్సర్ ఇచ్చారు మాధవీలత. తాను ముస్లిం వ్యతిరేకి అన్నట్లుగ క్రియేట్ చేస్తున్నారని.. అదే నిజం అయితే రంజాన్ మాసంలో ఊరేగింపులో ఎందుకు పాల్గొంటానని ఎదురు ప్రశ్నిస్తున్నారు మాధవీలత.
లేని ధనుస్సు, లేని బాణానికి తనపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని ఎవరో వీడియో చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అంటున్నారు. ముస్లింలను తాను రెచ్చగొట్టానని తనపై ఒకరు ఫిర్యాదు చేశారని.. కానీ ఆ వీడియోలో మసీదు లేదని, తనపై ఫిర్యాదు హాస్యాస్పదమని మాధవీలత కొట్టిపారేశారు.