MALLAREDDY: మల్లారెడ్డిపై మరో కేసు! రోడ్డెక్కిన బాధితులు..

తమ భూములు మల్లారెడ్డి కబ్జా చేశారని.. ఆ మధ్య గిరిజనులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఘటనపై చర్చ జరుగుతుండగానే.. మల్లారెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. తమ భూములు కబ్జాచేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన 6వందల మంది బాధితులు తరలి వచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 5, 2024 | 03:41 PMLast Updated on: Jan 05, 2024 | 3:41 PM

Case Filed Against Ex Minister Brs Mla Mallareddy

MALLAREDDY: తెలంగాణలో అధికారం మారడంతో.. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల వ్యవహారాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయ్. ఆర్మూర్ జీవన్‌ రెడ్డి, ఆ తర్వాత షకీల్.. ఇప్పుడు మల్లారెడ్డి.. బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తమ భూములు మల్లారెడ్డి కబ్జా చేశారని.. ఆ మధ్య గిరిజనులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఘటనపై చర్చ జరుగుతుండగానే.. మల్లారెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. తమ భూములు కబ్జాచేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన 6వందల మంది బాధితులు తరలి వచ్చారు.

YS JAGAN: వైసీపీ మూడో జాబితా సిద్ధం.. పది మంది సిట్టింగ్‌లకు షాక్ తప్పదా..?

శ్రీ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో.. తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు ఆదోళనకు దిగారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు కూడా ఆందోళనకు దిగారు. ప్రేమ్‌సాగర్‌ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆరోపణలు చేశారు.

తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డంపెట్టకుని బెదిరింపులకు పాల్పడ్డారని,… గతంలోనూ దీనిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, రెవిన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతులు ఇస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ప్రజావాణికి వచ్చామని బాధితులు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు మల్లారెడ్డి వ్యవహారంలో ఏం జరగబోతోంది.. మరో కేసు నమోదవడం ఖాయమా అనే చర్చ మొదలైంది.