Chikoti Praveen: బీజేపీలో చేరిన చికోటి.. అప్పుడు ఎందుకు వద్దన్నారు..? ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు..?

బీజేపీ ఎలాంటి కండీషన్స్‌ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా డీకే అరుణ ఆధ్వర్యంలో చికోటి బీజేపీలో చేరాడు. ఒకప్పుడు వద్దు అన్న బీజేపీ.. ఇప్పుడు పిలిచి మరీ చికోటిని పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2023 | 03:04 PMLast Updated on: Oct 07, 2023 | 8:16 PM

Casino King Chikoti Praveen Joins Bjp Ahead Of Telangana Polls

Chikoti Praveen: క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌ బీజేపీలో చేరారు. చాలా కాలం నుంచి బీజేపీలో చేరుతానని చెప్తున్న ప్రవీణ్‌.. శనివారం డికే ఆరుణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. నిజానికి ప్రవీణ్‌ బీజేపీలో చేరడం ఎప్పుడో జరగాల్సి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరబోతున్నట్టు గతంలోనే ప్రవీణ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. పార్టీ అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. పార్టీలో జాయినింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చికోటి చేరికను బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్‌ ప్రకాశ్‌ జవడేకర్‌ అడ్డుకున్నట్టు బీజేపీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది.

క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వీలు లేదంటూ చికోటి చేరికను ప్రకాశ్‌ అడ్డుకున్నారంటూ బీజేపీలో అంతర్గతంగా గుసగుసలు వినిపించాయి. ఇదే విషయంలో చికోటి ప్రవీణ్‌ కూడా స్పందించారు. తాను బీజేపీకి, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని.. తనతో ఏదైనా సమస్య ఉంటే బీజేపీ పెద్దలతో చర్చిస్తానంటూ చెప్పారు. కొన్ని రోజుల తరువాత ఇష్యూ సైలెంట్‌ అయిపోయింది. బీజేపీలో చికోటి పేరు గానీ.. చేరిక వ్యవహారం గానీ ఎక్కడా వినిపించలేదు. దీంతో ఇక చిటోకి బీజేపీకి దూరం అయినట్టే అని అంతా అనుకున్నారు. బీజేపీ ఎలాంటి కండీషన్స్‌ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా డీకే అరుణ ఆధ్వర్యంలో చికోటి బీజేపీలో చేరాడు. ఒకప్పుడు వద్దు అన్న బీజేపీ.. ఇప్పుడు పిలిచి మరీ చికోటిని పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం క్రితం తెలంగాణలో మంచి ఫామ్‌లో ఉన్న బీజేపీ ఇటీవల స్లో అయ్యింది. పార్టీలో అతర్గత పోరు బీజేపీకి గొడ్డలిపెట్టుగా మారింది. ఇప్పటికే ఉన్న కీలక నేతలు కూడా చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. దీంతో బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్‌ రీప్లేస్‌ చేసింది.

అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసి పెట్టుకున్నా.. బీజేపీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు కూడా లేరనే అపవాదు ఆ పార్టీ మీద ఉంది. ఆ కారణంగానే కలిసి వస్తామన్న ప్రతీవాళ్లను బీజేపీ చేర్చుకుంటోందనే టాక్‌ నడుస్తోంది. ఈడీ కేసు కారణంగా చికోటి చాలా సమస్యలు ఎదుర్కున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తనను శాశ్వతంగా జైలుకు పంపేందుకు ప్రయత్నించారంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్‌తో ఉన్న విరోధం తమకు ప్లస్‌గా మారే చాన్స్‌ కూడా ఉందనే లెక్కలు కమళం పార్టీ వేసుకుందనే చర్చ జరుగుతోంది. వాళ్ల ఇంటర్నల్‌ విషయాలు ఎలా ఉన్నా.. వద్దన్న వ్యక్తినే మళ్లీ పార్టీలోకి తీసుకుని విమర్శలు ఎదుర్కుంటోంది తెలంగాణ కమళం పార్టీ.