INDIA As BHARATH: క్రమంగా పేరు మార్చుకుంటున్న ఇండియా..

జీ20 సమ్మిట్‌ ఇన్విటేషన్‌తో ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ అంతకు ముందు నుంచే ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్స్‌ కంటే ముందు ప్రపంచానికి భారత్‌ అనే పేరును అలవాటు చేసే ప్రయత్నం చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 07:22 PMLast Updated on: Sep 06, 2023 | 7:22 PM

Central Govt Trying To Focus The World To India As Bharath

INDIA As BHARATH: ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం పబ్లిష్‌ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే టాపిక్‌ నడుస్తోంది. అయితే కేవలం జీ20 సమ్మిట్‌ డిన్నర్‌ ఇన్విటేషన్‌లో మాత్రమే కాదు. మెల్లి మెల్లిగా అన్ని నోటిఫికేషన్స్‌, ఇన్విటేషన్స్‌లో ఇండియా పేరును మార్చేస్తోంది. రీసెంట్‌గా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బ్రిక్స్‌ సమ్మిట్‌లో.. ప్రధాని మోదీ పేరు మీద ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా అని కాకుండా ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించారు.

కేవలం ఈ ఒక్కటే కాదు. ఆ తరువాత మోదీ చేసిన అన్ని విదేశీ యాత్రల్లో ఇండియా పేరును భారత్‌ అని రాశారు. జీ20 సమ్మిట్‌ ఇన్విటేషన్‌తో ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ అంతకు ముందు నుంచే ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్స్‌ కంటే ముందు ప్రపంచానికి భారత్‌ అనే పేరును అలవాటు చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే విదేశీ యాత్రలకు సంబంధించిన ఇన్విటేషన్స్‌లో భారత్‌ అని ముద్రిస్తోంది. నేటి నుంచి ఏసియన్-ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఏసియా సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోడీ విదేశాలకు వెళ్తున్నారు. ఈ టూర్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను, ప్రధాని షెడ్యూల్‌ను ఇప్పటికే విదేశాల ప్రతినిధులకు పంపించారు.

ఆ నోటిఫికేషన్‌లో కూడా ఇండియా ప్లేస్‌లో భారత్‌ అని ఉంది. దీంతో నెమ్మదిగా ఇండియా తన పేరు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచానికి ఇండియాను భారత్‌గా పరిచయం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది మోదీ ప్రభుత్వం. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.