అభయారణ్యంలో అంతిమ యుద్ధం, హోం శాఖ కీలక చర్చ…!
విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్రమంత్రులు జెపి నడ్డా, నిత్యానంద రాయ్, జ్యుయల్ ఓరం పాల్గొన్నారు.
విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్రమంత్రులు జెపి నడ్డా, నిత్యానంద రాయ్, జ్యుయల్ ఓరం పాల్గొన్నారు. ఇదే సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, ఏక్ నాథ్ షిండే ,చత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఒడిశా సీఎం చరణ్ మాజీ, ఏపీ హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
సమీక్ష సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పలు అభిప్రాయాలను కేంద్ర మంత్రి ముందు ఉంచే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల హోం మంత్రులు, సీఎస్‌లు, డిజిపిలు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డిజిపి ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డిజిపి జితేందర్ పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చ జరగనుంది.