Top story చాగంటి వారు… మనకేల ఈ పదవి గోల?
చంద్రబాబు నాయుడు మరోసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కి వలవిసిరారు. చాగంటిని ఏపీ ప్రభుత్వంలో భాగం చేయడం ద్వారా తన ప్రభుత్వం నైతిక విలువలకు పట్టం కడుతుందని జనంలో ప్రచారం చేయబోతున్నారు. అందుకే చాగంటికీ స్టూడెంట్స్ నైతిక విలువల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకుతో పదవి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు మరోసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కి వలవిసిరారు. చాగంటిని ఏపీ ప్రభుత్వంలో భాగం చేయడం ద్వారా తన ప్రభుత్వం నైతిక విలువలకు పట్టం కడుతుందని జనంలో ప్రచారం చేయబోతున్నారు. అందుకే చాగంటికీ స్టూడెంట్స్ నైతిక విలువల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకుతో పదవి ఇచ్చారు. అయితే చాగంటి ఆ పదవి తీసుకుంటారా లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
చంద్రబాబు వేసే ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. ప్రతి చర్యలోను రాజకీయ ప్రయోజనమే ఉంటుంది. దానిలో భాగమే చాగంటి కోటేశ్వరరావు కి నైతిక విలువలు సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకు పదవి ఇవ్వడం. ప్రవచనకర్త, వివాదరహితుడు ఆయన చాగంటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం పదవులు రావడం ఇది మూడోసారి.2016 లోనే అప్పటి టిడిపి ప్రభుత్వం క్యాబినెట్ హోదాతో చాగంటికీ సాంస్కృతిక సలహాదారు పదవి ఇచ్చింది. దానిలో ఆంతర్యం ఏమిటో తెలుసుకో లేక పోయిన చాగంటి మొదట ఆ పదవిని స్వీకరించి… చివరికి జాగ్రత్తగా మళ్లీ తప్పుకున్నారు. తన బొమ్మ పెట్టి రాజకీయం చేయబోతున్నారని గ్రహించి తెలివిగా తప్పించుకున్నారు.2023లో అప్పటి జగన్ ప్రభుత్వం మళ్లీ ఇలాంటి వలె మరొకటి విసిరింది. చాగంటి కోటేశ్వరరావు నీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమించింది. అప్పుడు కూడా ఆయన సున్నితంగా దీన్ని తిరస్కరించాడు. రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఎంత ప్రమాదకరము గుర్తించారు చాగంటి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా రాజకీయాల మాయం. అన్ని రకాల అవకతవకలకు అడ్డా టీటీడీ. పైగా గుడిలో జరిగేవన్నీ రాజకీయ నియమకాలే. కేవలం పైరవీలు కోసమే టీటీడీలో పదవులు సంపాదిస్తారు. అందుకే అప్పుడు చాగంటి సున్నితంగానే దాన్ని తిరస్కరించారు. అయితే ఒకసారి మాత్రం జగన్ ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు గడిపి, గోశాలను చూసి ప్రశాంతంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మూడోసారి చాగంటి కి క్యాబినెట్ హోదా తో కూడిన పదవి దక్కింది. చాగంటి సన్నిహితులు, శిష్యులు మాత్రం ఈ పదవి స్వీకరించొద్దని ఆయనకు చెబుతున్నారు. చాగంటి ఇప్పుడు అందరివాడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చే క్యాబినెట్ హోదా పదవిని తీసుకుంటే కొందరికే పరిమితం అయిపోతాడు. అంతేకాదు టిడిపి తన రాజకీయ అవసరాలకు ఆయన అనుమతి లేకుండానే ఆయన్ని వాడేసుకుంటది. కొన్ని కులాల ఓట్లను సైతం చాగంటినీ అడ్డంపెట్టి లాగేయడానికి అవకాశం కూడా ఉంది. ఒకప్పుడు జగన్ కూడా ఇదే ఉద్దేశంతో ఆయనకు పదవి కట్టబెట్టాలని చూశారు. అందుకే పదవుల జోలికి పోవద్దని కొందరు చాగంటి కి సూచిస్తున్నారు.
నిజానికి చాగంటి ఎక్కడ ప్రవచనం చెప్పిన, ప్రసంగం చెప్పిన రూపాయి కూడా తీసుకోరు. రవాణా సదుపాయాలు… సౌకర్యాలు కల్పిస్తే చాలు ఎక్కడికైనా వచ్చి మాట్లాడతారు. ఎవరితోనో ఘర్షణ వాతావరణ సృష్టించుకోరు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసే రిటైర్ అయ్యారు. ఆయన పిల్లలు హైదరాబాదులో ఐటి చేస్తున్నారు. ఎవరిని పైసా ఆశించకుండా ప్రవచనం చెప్పి ఏకైక ధార్మిక తత్వ వేత్త చాగంటి వారు. చాగంటితో పోలిస్తే సహస్ర అవధాని గరికపాటి మహా మాటకారి. ఎక్కడకు వచ్చిన ఆయన దండిగా పారితోషకాలు తీసుకుంటాడు . మోడరన్ ఉపమానాలతో దంచుతుంటాడు. గరికపాటికి రాజకీయ పరిచయాలు బాగా ఉన్నాయి. వీలున్నప్పుడల్లా ప్రధాని మోడీ భజన బాగా చేస్తుంటాడు. అందుకే ఆయనకు పద్మశ్రీ త్వరగా వరించింది. చాగంటి ఈనాటి వరకు ఏ రాజకీయ పార్టీతోను అంటకాగలేదు. ఏ నాయకుడిని ఎప్పుడూ పొగడలేదు. అందుకే ఆయనకి పద్మశ్రీ ఇప్పటివరకు రాలేదు. మూడుసార్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పదవులు ఇచ్చిన ఇప్పటివరకు సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పదవి తీసుకుంటే లేనిపోని రాజకీయాలు అంటుతాయేమో అని అనుమానం కూడా ఉంది. పైగా రాటు తేలిన రాజకీయ నాయకులకు నైతిక విలువలు అనే సబ్జెక్టు బోధించడం అంత ఆషామాషీ కాదు. చాగంటి కి పదవులు కన్నా ఆయనకు పద్మశ్రీ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రికమంత్ చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాగంటి అందుకు నూటికి నూరు శాతం అర్హుడు కూడా.