CHANDRABABU NAIDU: టీడీపీకి బ్యాడ్ సెంటిమెంట్‌గా ఆ రెండు నెలలు.. అక్టోబర్‌లో సైకిల్ పార్టీకి ఏం జరగబోతోంది..?
ఆగస్ట్ నెల వచ్చిందంటే చాలు.. సైకిల్ పార్టీ టెన్షన్ పడిపోతోంది. కేడర్‌లో ఒక రకమైన భయం అలుముకుంటుంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు ప్రతీసారి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం తప్పడం లేదు.
CHANDRABABU NAIDU: రాజకీయ నాయకులకు, సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అడుగు తీసి అడుగు వేయాలన్నా.. ముహూర్తం చూస్తుంటారు ప్రతీదానికి. ఇక సెంటిమెంట్ అస్త్రాలు కూడా బాగానే పనిచేస్తుంటాయ్ పాలిటిక్స్‌లో. ఒక్కోసారి అవే కోలుకోలేని దెబ్బ తీస్తుంటాయ్ కూడా. టీడీపీ విషయంలో ఈ సెంటిమెంట్లు చాలాసార్లు ప్రభావం చూపాయ్. ఆగస్ట్ నెల వచ్చిందంటే చాలు.. సైకిల్ పార్టీ టెన్షన్ పడిపోతోంది. కేడర్‌లో ఒక రకమైన భయం అలుముకుంటుంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు ప్రతీసారి ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం తప్పడం లేదు.1984 ఆగస్టు 15న ఎన్టీఆర్‌పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. 1995 ఆగస్టులో అదే ఎన్టీఆర్‌పై చంద్రబాబు తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఇవే కాదు.. ఆగస్ట్‌లోనే టీడీపీలో ఎన్నో రకాల సంక్షోభాల చోటు చేసుకున్నాయ్. ఎంతోమంది నాయకులు పార్టీకి దూరం అయ్యారు. కొందరు ప్రమాదాలకు గురయ్యారు. ఐతే ఈసారి మాత్రం టీడీపీకి సెప్టెంబర్ సంక్షోభం వెంటాడింది. అక్టోబర్‌లోనూ కొనసాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయింది సెప్టెంబర్ నెలలోనే! ఆయన కుమారుడు లోకేశ్‌తో పాటు.. పార్టీ కీలక నాయకుల కూడా కేసుల బారిన పడ్డారు. వారి అరెస్టులు కూడా తప్పవని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇంతవరకు జైలు ముఖం చూడలేదు. అసలు ఆయన అరెస్టు అవుతారని కూడా ఎవరూ ఊహించలేదు. ఒకవేళ అరెస్టు చేసినా గంటల వ్యవధిలో బయటకు వస్తారని భావించారు. ఐతే గంటలు.. రోజులుగా మారాయి. రోజులు… వారాలు దాడుతున్నాయ్. నెల సమీపిస్తోంది ఇప్పుడు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలలు చంద్రబాబుకు చీకటి రోజులను మిగిల్చాయి. గతంలో అక్టోబరు నెలలో చంద్రబాబు దాదాపు చావు అంచుల వరకు వెళ్లిపోయారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు 2003 అక్టోబర్ 1న తిరుపతి వెళ్లారు. అలిపిరి టోల్ గేట్ సమీపంలో నక్సలైట్ల బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన కూడా అక్టోబర్‌లోనే చోటు చేసుకుంది. ఆ ఘటన జరిగి 20 ఏళ్లు గడుస్తోంది. ఇలా ఆగస్ట్, సెప్టెంబరే అనుకుంటే.. ఇప్పుడు అక్టోబర్ కూడా తెలుగుదేశం శ్రేణులను భయపెడుతోంది.