అంబటి గాలి తీసిన చంద్రబాబు
ఏపీ శాసన సభలో సిఎం చంద్రబాబు... మాజీ మంత్రి అంబటి లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంబటి కి టీఎంసీ కు క్యూసెక్కు కు తేడా తెలియలేదు అంటూ ఎద్దేవా చేసారు.
ఏపీ శాసన సభలో సిఎం చంద్రబాబు… మాజీ మంత్రి అంబటి లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంబటి కి టీఎంసీ కు క్యూసెక్కు కు తేడా తెలియలేదు అంటూ ఎద్దేవా చేసారు. డయా ఫ్రం వాల్ దెబ్బతిందని ఏవో కథలు చెప్పారని… వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లి వరకు తీసుకెళ్తామన్నారు. వంశధార తో అనుసంధానం చేసే ప్రక్రియ పైనా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.
2027 కంతా పోలవరం ను పూర్తి చేస్తాం అని స్పష్టం చేసారు. తెలుగుగంగా ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకొని వెళ్ళాలంటే వ్యతిరేఖించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసారు. ఓపెన్ కెనాల్ ద్వారా రాయలసీమను సస్య స్యామలం చేస్తూ తమిళనాడుకు 10 టిఎంసీల తాగునీరు అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రాజెక్టులకు అత్యంత ఎక్కువగా ఖర్చు చేసింది టీడీపీనే అని స్పష్టం చేసారు. పోలవరంకు 12 ,187 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించిందన్నారు. ఇప్పటికే 2900 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని తెలిపారు. కొత్త డయాఫ్రం వాల్ ను, ఈసిఆర్ డ్యామ్ ను ఏకకాలంలో నిర్మిస్తాం అని స్పష్టం చేసారు.