బెజవాడ రౌడీలను తోక్కేసా: చంద్రబాబు కామెంట్స్
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి అసాధ్యమన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో మత గొడవలు ఉండేవన్న ఆయన... రాయలసీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీలు ఉండేవారన్నారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి అసాధ్యమన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో మత గొడవలు ఉండేవన్న ఆయన… రాయలసీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీలు ఉండేవారన్నారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశామని పేర్కొన్నారు. గంజాయి సహా అనేక సమస్యలు ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. వాటి మూలాలు విశాఖలో ఉండేవి అన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అని ఆరోపించారు. గంజాయి భయంకరంగా తయారైందని మండిపడ్డారు. ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్ ఉంటోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలు చేశారన్న చంద్రబాబు… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టం చేసామని పేర్కొన్నారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరని హెచ్చరించారు. నిందితులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామన్నారు. భూ ఆక్రమణలపై డీఎస్పీ స్థాయి అధికారి విచారిస్తారని తెలిపారు.