ఎన్నికలపై చంద్రబాబు సంచలన కామెంట్స్
జమిలీ ఎన్నికలకు ఏపీ సిఎం చంద్రబాబు జై కొట్టారు. ఢిల్లీ పర్యటన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
జమిలీ ఎన్నికలకు ఏపీ సిఎం చంద్రబాబు జై కొట్టారు. ఢిల్లీ పర్యటన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలి… సాధారణ ఎన్నికలలో పాటు స్థానిక ఎన్నికలు కూడా జరిగితే పరిపాలనకు సమయం ఉంటుందన్నారు. అనేక సార్లు ఎన్నికలు జరగడం వలన ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
2047 కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు వచ్చే టైం కి ఇండియా తప్పకుండా మొదటి ప్లేస్ లో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక ఆరచక పాలన వలన రాష్ట్రం నష్టపోయిందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌకర్యాలు మనకి ఉన్నాయన్న చంద్రబాబు… రాష్ట్రంలో రైల్వే కి రెండు లైన్స్ ని నాలుగు లైన్స్ చేస్తున్నారన్నారు. బులెట్ ట్రెయిన్ అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నారు.. తప్పకుండా దక్షిణభారత లో పెట్టే ఆలోచన చెయ్యాలని కోరినట్టు తెలిపారు. ఇక హర్యానాలో బిజెపి విజయం సాధించడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేసారు.