చంపాలనకుంటే స్పీకర్ అయ్యాడు: చంద్రబాబు

డిప్యూటి స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజు ఎన్నిక అయిన తర్వాత సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మాకు ప్రతిపక్ష హోదాలేకుండా చేస్తామన్నారని... ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఎద్దేవా చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 03:59 PMLast Updated on: Nov 14, 2024 | 3:59 PM

Chandrababu Comments On Ys Jagan 2

డిప్యూటి స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజు ఎన్నిక అయిన తర్వాత సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మాకు ప్రతిపక్ష హోదాలేకుండా చేస్తామన్నారని… ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఎద్దేవా చేసారు. ప్రతిపక్షహోదా నాయకులు ఇచ్చేది కాదు..ప్రజలు ఇవ్వాలన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో హోదాలను ఎవరూ శాసించలేరు అని స్పష్టం చేసారు.

ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారన్న చంద్రబాబు… రఘురామను అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు…ఇప్పుడు సభకు రాలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు చంద్రబాబు. అసెంబ్లీని కౌరవసభగా మార్చారని మండిపడ్డారు. గౌరవసభ అయ్యాకే వస్తానని శపథం చేశానన్న చంద్రబాబు… జగన్ అవమానించిన వ్యక్తి స్పీకర్ అయ్యారని పేర్కొన్నారు. జగన్‌ ఎవరినైతే చంపాలనుకున్నారో…ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్ అయ్యారన్నారు.