జగన్ హీరోవి కాదు, చంద్రబాబు వార్నింగ్

తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడు అంటూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు... వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. తండ్రి సంపాదించిన ఆస్ధి ఆయన భార్యకు రాదా అని నిలదీశారు. 2004లో ఈయన ఆధాయం ఎంత ఎక్కడినుంచి వచ్చాయి ఈ లక్షల కోట్లు అని ప్రశ్నించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 06:58 PMLast Updated on: Oct 24, 2024 | 6:58 PM

Chandrababu Comments On Ys Jagan

తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడు అంటూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు… వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. తండ్రి సంపాదించిన ఆస్ధి ఆయన భార్యకు రాదా అని నిలదీశారు. 2004లో ఈయన ఆధాయం ఎంత ఎక్కడినుంచి వచ్చాయి ఈ లక్షల కోట్లు అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయలంటే సిగ్గుగా ఉంది అన్నారు చంద్రబాబు. వంకర రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకొండి అని హితవు పలికారు.

విలువలు లేని మనుషులు సమాజానికి చేటు అన్నారు. ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడైనా ఇచ్చారా…పదిలక్షలు ఇచ్చే శక్తి ఇప్పడు వచ్చిందా అని నిలదీశారు. డబ్బు ఇవ్వాలని కొరుతున్నా…..అలా అయినా అవినీతి డబ్బు ప్రజలకు చేరుతుంది అన్నారు. అయిదేళ్లు ఇంట్లోనుండి నన్ను బయటకు రానివ్వలేదన్నారు. ఇప్పడు తిడుతున్న వాళ్ళను ఆపాలంటే ఒక్క నిమిషం అన్నారు చంద్రబాబు. అమరావతిని చూడడానికి వస్తే డీజీపి ప్రజాస్వమ్యంలో ఎవ్వరయినా చెయ్యోచ్చు అంటున్నారు అని… మేము వారిలా చెయ్యం నో వే అంటూ క్లారిటీ ఇచ్చారు. విలువలు లేని రాజకీయం చేసి అందులో హీరోయిజం చేయాలనుకుంటే కల అన్నారు.