ఎమ్మార్పీ 1 రూ… పెంచినా భారీ ఫైన్, చంద్రబాబు సంచలనం
ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల అయింది.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.
మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపు లు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు. ఇదే తప్పు రెండోసారి చేస్తే దుకాణం లైసెన్స్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఇదే నిబంధన కింద బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసారు.