మోడీని వదలని బాబు, మళ్ళీ ఢిల్లీ టూర్…!
ఈ నెల 16న ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈనెల 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నెల 16న ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈనెల 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మోదీతో పాటు మరి కొంతమంది కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు… రాష్ట్రానికి మరిన్ని నిధులు కోరే అవకాశం ఉంది. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా రూ.15వేల కోట్లను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలపు రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నారు. ఇటీవల నిర్మలా సీతారామన్ ను ఏపీ ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిసారు.మొన్న బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినా చంద్రబాబు మాత్రం మరిన్ని నిధులు కావాలని అడుగుతున్నారు. మరి దీనిపై ప్రధాని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.