మావోయిస్ట్ ల కంటే జగన్ రాజకీయానికి భయపడ్డా: చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 150 రోజుల పాలన పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... 1978 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి 46 సంవత్సరాలు గా నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 150 రోజుల పాలన పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… 1978 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి 46 సంవత్సరాలు గా నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. క్లేమోర్ మైన్స్ కు భయపడలేదు కానీ కుటుంబ సభ్యులను అవమానించినప్పుడు కాస్త భయమేసింది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
జైలు కు పంపినా జంకలేదన్న ఆయన దేశ రాజకీయాల్లో అనేక సార్లు కీలక పాత్ర పోషించానని తెలిపారు. రోజులు లెక్కబెట్టుకుని పని చేస్తున్నా, నాలుగోసారి అధికారంలోకి వచ్చి 162 రోజులైందని… ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని హామీ ఇస్తున్నా అని స్పష్టం చేసారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ పాలన సాగిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.