ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు…!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు చంద్రబాబు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 01:15 PMLast Updated on: Dec 25, 2024 | 1:15 PM

Chandrababu Is Busy In Delhi

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఉదయం గం. 8.30కు సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం గం. 12.30కు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ సమావేశానికి హాజరు అయ్యారు చంద్రబాబు.

మధ్యాహ్నం గం. 2.30కు సీఎం అధికారిక నివాసం 1, జన్‌పథ్‍‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేరుకుంటారు. అనంతరం కుమారస్వామితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చిస్తారు. సాయంత్రం గం. 5.00కు ప్రధాని నివాసంలో మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం గం. 6.30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు చంద్రబాబు. రాత్రి గం. 7.30కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశం కానున్నారు చంద్రబాబు.