హడావుడిగా డీజీపీతో చంద్రబాబు భేటీ, ఏం జరుగుతోంది…?
సచివాలయంలో డిజిపి తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. టీటీడీ లడ్డూ - కల్తీ నెయ్యి వ్యవహారం పై సిట్ ఏర్పాటు పై సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకం పై డిజిపితో చంద్రబాబు చర్చించారు.

సచివాలయంలో డిజిపి తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. టీటీడీ లడ్డూ – కల్తీ నెయ్యి వ్యవహారం పై సిట్ ఏర్పాటు పై సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకం పై డిజిపితో చంద్రబాబు చర్చించారు. ఐజీ లు వినీత్ బ్రిజ్ లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సిహెచ్ శ్రీకాంత్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిట్ లో మిగతా టీమ్ సభ్యుల పై డిజిపితో చంద్రబాబు చర్చించారు.
నెయ్యి కొనుగోలు, అక్రమాలు, కల్తీ, టెండర్ వ్యవహారాలు, పర్యవేక్షణ తదితర అంశాలపై సిట్ విచారణ చేయనుంది. ఇక ఈ వ్యవహారంపై అటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసారు.