Chandrababu Naidu: ఆ రెండు షరతుల్లో బాబుకు రిలీఫ్! స్కిల్ కేసులో సుప్రీం ఆదేశాలు
ఈ స్కాం కేసులో బాబుకు హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదన పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ స్కాం కేసులో బాబుకు హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదన పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడా ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది.
ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికలు.. విద్యా సంస్థలకు సెలవులు..
ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. డిసెంబర్ 8 వరకు నోటీసులకు రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ షరతుల అంశాన్ని సీఐడీ తరపున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతులను పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో మాట్లాడవచ్చన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. తదుపరి విచారణ వరకు ఈ కేసు గురించి చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. రెండు పక్షాలు కూడా దీనిపై బహిరంగంగా మాట్లాడవద్దని ధర్మాసనం ఆదేశించింది. అలాగే నవంబర్ 3న హైకోర్టు పెట్టిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనరాదన్న అంశంను మినహాయించి మిగిలిన షరతులు వర్తిస్తాయని అన్నారు న్యాయమూర్తులు. దాంతో బాబుకు ర్యాలీలు, సభల్లో పాల్గొనే అవకాశం దక్కింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 17A పై జడ్జిమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసం తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా ప్రభుత్వం చూపించలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.