CHANDRABABU NAIDU: టీడీపీ, జనసేన నేతలు కలిసి నడవాలి.. గెలిచే వారికే టిక్కెట్లు: చంద్రబాబు
క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేసి, జగన్‌ను ఇంటికి సాగనంపుదాం. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉంది. గెలిచే అవకాశం ఉన్న వారికే ఈసారి టికెట్లు ఇస్తా. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. పనితీరు బాగాలేకపోతే.. వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతాం.

CHANDRABABU NAIDU: ఏపీలో ప్రతి కార్యక్రమంలో జనసేన, టీడీపీ కలిసి నడవాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈసారి గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ”తెలుగుదేశం, జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ప్రతి కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలి. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలో కలసి పోరాడాలి.
KCR: కోలుకుంటున్న కేసీఆర్.. మరో వారం ఆస్పత్రిలోనే..
క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేసి, జగన్‌ను ఇంటికి సాగనంపుదాం. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉంది. గెలిచే అవకాశం ఉన్న వారికే ఈసారి టికెట్లు ఇస్తా. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. పనితీరు బాగాలేకపోతే.. వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. పార్టీ శ్రేణులు.. ఓట్ల అవకతవకల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దొంగఓట్లు, ఓట్ల తొలగింపు విషయంలో ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతలు తీసుకోవాలి. ఈ విషయంలో అన్ని అంశాల్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందనే అలసత్వం వద్దు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో మొహమాటాలకు పోయి ఓడిపోయే అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇచ్చేవాళ‌్లు.
అయితే, తెలంగాణలో గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెస్. సర్వేల ఆధారంగా మాత్రమే టిక్కెట్లు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాను ఏపీలోనూ ఫాలో అవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు జనసేనతో టిక్కెట్ల పొత్తు అంశం కూడా తేలాల్సి ఉంది.