బుద్ధి లేదా..? ఎన్నిసార్లు అడిగించుకుంటారు..,? ముగ్గురు మంత్రులపై చంద్రబాబు సీరియస్..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంత్రుల పనితీరుపై చాలా సీరియస్ గా ఉన్నారు. కొంతమంది మంత్రులు కనీసం ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయడం లేదని అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 12:14 PMLast Updated on: Jan 03, 2025 | 12:14 PM

Chandrababu Naidu Serious On Cabinet Ministers

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంత్రుల పనితీరుపై చాలా సీరియస్ గా ఉన్నారు. కొంతమంది మంత్రులు కనీసం ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయడం లేదని అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. గతంలో మంత్రులు చంద్రబాబు మాట వినేవారు కానీ ఈసారి క్యాబినెట్లో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనబడుతోంది. క్యాబినెట్లో యువకులకు అవకాశం కల్పించాలని కొంతమంది కొత్త వారికి చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ అవకాశాలను వాడుకునే విషయంలో మాత్రం మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారు. క్యాబినెట్ సమావేశాలకు ఆలస్యంగా రావడమే కాకుండా మొన్న మద్య జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా మంత్రులు లెక్కలేనితనంగానే వ్యవహరించారు.

ప్రశ్నోత్తరాలు సమయంలో కొంతమంది మంత్రులు శాసనసభకు ఆలస్యంగా రావడం పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు మంత్రుల కోసం స్వయంగా అయ్యన్నపాత్రుడు క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు అయ్యన్నపాత్రుడు. సభకు ఎలా రావాలి.. ప్రశ్నోత్తరాల సమయం మంత్రులకు ఎంత ముఖ్యం అనే అంశాలకు సంబంధించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. కానీ మంత్రులు మాత్రం మార్పు కనపడటం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం అలాగే మీడియా సమావేశాలకు మంత్రులు దూరంగా ఉండటం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వివరణలు ఇవ్వకపోవడం.. వంటివి కూడా ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో వైయస్ జగన్ అలాగే వైసిపి నేతలు కొంతమంది పదేపదే మీడియా సమావేశాల్లో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబును అలాగే మంత్రులను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అప్పులపై వైసీపీ నేతలు టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. అయినా సరే మంత్రులు మాత్రం కౌంటర్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగే కొంతమంది వైసీపీ నేతలు అవినీతి వ్యవహారాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం విషయంలో చంద్రబాబు సర్కార్ కాస్త సీరియస్ గానే అడుగులు వేసింది. ఆ తర్వాత ఆయనపై కృష్ణా జిల్లా మంత్రులు గాని లేదంటే ఇతర జిల్లాల మంత్రులు గాని ఎవరూ కూడా ఆరోపణలు చేయలేదు. ఒకప్పుడు నాని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అలాగే మంత్రి లోకేష్ ను అప్పట్లో నాని తీవ్రంగా విమర్శించారు. అయినా సరే నాని అవినీతి చేసి అడ్డంగా దొరికినా.. మంత్రులు మాత్రం మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే.. చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రులను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగారు. అలాగే శాఖలపై కూడా రిపోర్ట్ లను ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రతిసారి ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు రిపోర్టులు ఎక్కడా అని అడుగుతూనే ఉన్నారు… అయినా సరే ఇప్పటివరకు కొంతమంది మంత్రులు రిపోర్టు కూడా చంద్రబాబుకు అందించలేకపోయారు. దీనిపై తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు.

ఎన్నిసార్లు అడిగించుకుంటారని.. శాఖలో ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వమంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనీ… క్యాబినెట్ సమావేశంలోనే చంద్రబాబు కొంతమంది మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల వారీగా పనితీరు మెరుగుపడాలంటే రిపోర్టుల ఆధారంగానే సాధ్యమవుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. తాను గతంలో కూడా రిపోర్టులు అడిగానని కనీస స్పందన లేదని… అలాగే ఉండేలా అయితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని కూడా కొంతమంది మంత్రులను హెచ్చరించారు చంద్రబాబు.

పనితీరు మెరుగుపడనప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి ఉపయోగం లేదని సాధారణ ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగువచ్చని, మంత్రులయినంత మాత్రాన క్షేత్రస్థాయి పర్యటనలు చేయకూడదని రూల్ ఎక్కడా లేదని… కనీసం మీ మీ నియోజకవర్గాల్లో అయినా తిరిగి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే అంత సర్వనాశనం అవుతుందని.. వైసీపీకి మళ్ళీ అధికారాన్ని విస్తరిలో పెట్టి ఇచ్చినట్లే ఉంటుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారట.