Chandrababu Naidu: ఆ 70మందిని టార్గెట్‌ చేసిన టీడీపీ.. టీడీపీ విజయాన్ని ఆపడం కష్టమేనా ?

ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషయం వివాదంగా మారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మరింత మారింది. వివేకా కేసులో వైఎస్‌ కుటుంబం చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. పక్కా క్లారిటీతో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలు, పవన్‌తో చంద్రబాబు మీటింగ్‌.. ఇలాంటి పరిణామాలన్నీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2023 | 04:00 PMLast Updated on: May 03, 2023 | 4:00 PM

Chandrababu Naidu Strategy On 2024 Elections

ఇదే టెంపోను కంటిన్యూ చేయగలిగితే.. పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న నమ్మకంతో కనిపిస్తున్నారు చంద్రబాబు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నారు చంద్రబాబు. ఇదేం ఖర్మ అంటూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. మాటలకు పదును పెంచినా.. చంద్రబాబు స్ట్రాటజీ ఒక్కటే.. ఇదే జోష్‌లో వైసీపీ కొట్టేయాలని ! ఐతే ఇప్పుడు మరో భారీ స్ట్రాటజీని టీడీపీ బాస్ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా ఆ 70 నియోజకవర్గాలపై, ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రత్యేకంగా నజర్ పెట్టారు. సీఎం కావడానికి ముందు జనంతో, జనంలోనే కనిపించిన జగన్.. ఆ తర్వాత అదే జనానికి దూరం అయ్యారు. సంక్షేమం మాత్రమే గెలిపిస్తుందనే భ్రమలోకి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ మీద క్షేత్రస్థాయిల వ్యతిరేకత పెరిగిపోయింది. మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. గడపగడపకు కార్యక్రమంలో అదే కనిపించింది. ఎక్కడ చూసినా నిలదీతలు, నిరసలు.. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎదురైన పరిస్థితులు ఇవే. ఇక అటు ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. 70మంది ఎమ్మెల్యేలు ఈసారి మళ్లీ గెలవడం కష్టమే అని నివేదికలన్నీ చెప్పాయి. ఆ 70 మంది ఎమ్మెల్యేలనే ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేస్తోంది. నిజానికి ఆ 70మంది కూడా జగన్‌ వేవ్‌లో గెలిచినవాళ్లే !

70మందిలో చాలామంది ఎమ్మెల్యేలు.. రాజకీయంగా పెద్దగా పరియచం లేని వాళ్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జస్ట్‌ జగన్ బొమ్మతో గెలిచారు అంతే వాళ్లంతా ! నిజానికి ఆ 70మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు గెలుపు మీద ఎలాంటి ఆశలు లేవు. అప్పుడంటే జగన్ మీద నమ్మకం వీళ్లను గెలిపించింది. ఐతే ఇప్పుడదే జగన్ మీద జనాలకు నమ్మకం పోయింది. గడపగడపకు కార్యక్రమంలో బయటపడింది అదే ! సొంతంగా గెలిచే దమ్ము ఎలాగూ లేదు. దీంతో జగన్‌ డబ్బులు ఇస్తే గెలుస్తాం.. లేకపోతే లేదు అనే స్థితికి వెళ్లిపోయారు ఆ 70మంది ఎమ్మెల్యేలు. పార్టీ కోసం సొంతంగా పైసా తీసే పరిస్తితులో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఆ నియోజకవర్గాలను, ఎమ్మెల్యేలనే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంటోంది. వేట అక్కడి నుంచి మొదలుపెట్టాలని ఫిక్స్ అయిపోయింది.

ఆ 70 నియోజకవర్గాల్లో పక్కా ప్లాన్‌తో వ్యూహాలు రచిస్తే.. గెలవడం అసాధ్యం కాదు అనే ఆలోచనలో చంద్రబాబు కనిపిస్తున్నారు. మొదటగా ఆ 70 నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆయుధంగా మార్చుకొని.. టీడీపీని బలోపేతం చేస్తే.. ఆ సీట్లన్నీ తమ ఖాతాలనే పడడం ఖాయం అని సైకిల్ పార్టీ భావిస్తోంది. జగన్ అలర్ట్ అయిపోయి.. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చినా పెద్ద ఇబ్బంది ఉండదు అన్నది టీడీపీ ప్లాన్‌. 70 స్థానాల్లో ఫ్యాన్‌ను దెబ్బతీసి.. ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా చూపించి.. అధికారం ఎగరేసుకుపోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టీడీపీ స్ట్రాటజీలు ఈజీగా సక్సెస్ అవుతాయా.. జగన్‌ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేశారన్నదే ఇప్పుడు ఆసక్తికరం.