ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై, టిటిడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ కు మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయి. అధికారులకు చైర్మన్ కు మధ్య సమన్వయ లోపం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కు మైండ్ బ్లాక్ అయింది. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... గురువారం ఉదయం తిరుమల చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న తోక్కిసలాట బాధితులను పరామర్శించి వారితో స్వయంగా మాట్లాడారు. అలాగే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరణించిన వారికి అలాగే గాయపడిన వారికి నష్టపరిహారం ప్రకటించారు. అనంతరం టిటిడి పరిపాలన భవనంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, అలాగే టిటిడిలోని పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ముందు నుంచి టీటీడీలో సమన్వయ లోపం ఉందనే అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. వీటిని నిజం చేస్తూ టీటీడీ చైర్మన్, ఈఓ శ్యామలరావు ఇద్దరు ఒకరిపై ఒకరు చంద్రబాబు ముందే తిట్టుకోవడం చూసి మంత్రులు కూడా అసలేం జరుగుతుందో అర్థం కాక సైలెంట్ అయిపోయారు. ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదని బిఆర్ నాయుడు చంద్రబాబు ముందే అసహనం వ్యక్తం చేశారు చైర్మన్ అనే గౌరవం కూడా ఇవ్వడం లేదని... అసలు ఏ చిన్న విషయం కూడా తన దృష్టికి తీసుకురావడం లేదని మీరైనా చెప్పాలంటూ చంద్రబాబు నాయుడును బి.ఆర్ నాయుడు కోరారు. దీనితో అక్కడి నుంచి ఈవో ఫైర్ అయిపోయారు. నీకేం చెప్పడం లేదు అంటూ ఏక వచనంతో మాట్లాడారు.. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా...? అంటూ చైర్మన్ తో వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు సీఎం ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇక మంత్రి అనగానే సత్యప్రసాద్ జోక్యం చేసుకొని ఈవోను హెచ్చరించారు. ఏం మాట్లాడుతున్నారు...? ముఖ్యమంత్రి మనందరికీ బాస్... ఆయన ముందు ఏం మాట్లాడాలో తెలియదా...? శ్రీవాణి ట్రస్ట్ లో ఏమైనా అంశాలు ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి... ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అవ్వగా చంద్రబాబు జోక్యం చేసుకుని సత్యప్రసాద్ ను కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఈవో, చైర్మన్ పై చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో తనకు అర్థం కావటం లేదని.. సమీక్షా సమావేశంలో వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. మీ పరిది దాటి మాట్లాడుకుంటున్నారని... మీ ఫ్రస్టేషన్ ఎవరి పైన చూపిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ జరిగిందేంటి? మీరు మాట్లాడుకుంటున్నది ఏంటి? జరుగుతుంది ఏంటి? అంటూ చంద్రబాబు అసహనంగా మాట్లాడారు. ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఓపిక సమన్వయం ఉండాల్సిందేనని... అది మీకెందుకు సాధ్యపడటం లేదంటూ ప్రశ్నించారు. నేను, చీఫ్ సెక్రటరీ తో సమన్వయంతో పని చేసుకోవడం లేదా...? మేము కోఆర్డినేషన్లో లేమా అంటూ ప్రశ్నించారు. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా...? ఇద్దరు కలిసి పని చేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది...? ఇలా కొట్టుకుంటే ఎలా...? ఇదేం భాష, ఇదేం వ్యవహారం అంటూ చంద్రబాబు అందరి ముందు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్ధతిగా లేదని వెంటనే ఇలాంటివి ఆపాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలి పై కూడా ప్రస్తావన రాగా చంద్రబాబు మాట్లాడుతూ... వాటన్నిటిపై తర్వాత మాట్లాడదాం అని ఇది సందర్భంగా కాదంటూ సమయం వచ్చినప్పుడు అన్ని పరిశీలిస్తామని... కానీ మీ పద్ధతి మారాల్సిందేనని సమన్వయంతో పని చేయాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించానని.. తప్పు ఎవరిదో అక్కడ తేలుతుందని... ఎవరిని వదిలే ప్రశ్నే లేదంటూ చంద్రబాబు ఘాటుగానే మాట్లాడారు.[embed]https://www.youtube.com/watch?v=25R9-eWvkjw[/embed]