CHANDRABABU NAIDU: బాబు ఇండియా కూటమికి వెళ్తారా..? మరి పవన్ పరిస్థితి ఏంటి ?
బాబు ఇండియా కూటమిలోకి వెళితే.. టీడీపీతో పొత్తుపెట్టుకొని.. NDAతో ఫ్రెండ్షిప్ చేస్తున్న పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
CHANDRABABU NAIDU: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చి బాబును కలసి వెళ్ళాక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును ఇండియా కూటమిలోకి తీసుకెళ్ళడానికే పీకే వచ్చాడని వైసీపీ లీడర్లు చెబుతున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ అంటూ కథనాలు ఇస్తోంది.
PAWAN KALYAN: అయ్యో పవన్ ! డిప్యూటీగా కూడా పనికిరాడా..? జనసేనాని పరువు తీస్తున్న లోకేష్
మరి బాబు ఇండియా కూటమిలోకి వెళితే.. టీడీపీతో పొత్తుపెట్టుకొని.. NDAతో ఫ్రెండ్షిప్ చేస్తున్న పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ఏపీలో పవర్‌లోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అందుకే గతంలో తిట్టిపోసిన ప్రశాంత్ కిషోర్ మళ్ళీ టీడీపీకి దిక్కయ్యాడు. లోకేష్ వెంటపెట్టుకొని మరీ వచ్చి.. బాబుతో మీటింగ్‌లో కూర్చొబెట్టాడు. బాబు-పీకే మీటింగ్‌పై వైసీపీ మంత్రులు బండబూతులు తిట్టారు. అంతేకాదు.. అసలు పీకే వచ్చింది టీడీపీని, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి తీసుకువెళ్ళడానికే అంటున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచనలతోనే పీకే.. ఏపీకి వచ్చి బాబును కలిశాడని అంటున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, మిత్ర పక్షాలు, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమిలోకి నిజంగా చంద్రబాబు వెళతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మూడు పార్టీల్లో అధికార వైసీపీ, టీడీపీ ఏ కూటమిలోనూ భాగస్వాములు కావు. జనసేన మాత్రం బీజేపీ ఆధ్వర్యంలోని NDAలో కొనసాగుతోంది. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించింది. బీజేపీని సంప్రదించకుండానే పవన్ కల్యాణ్ డెసిషనన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ లీడర్లు, మంత్రులు ఆరోపిస్తున్నట్టుగా.. టీడీపీ కాంగ్రెస్ కూటమిలోకి చేరిపోతే జనసేనాని పరిస్థితి ఏంటి..? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా..? అసలు నిజంగా బాబుకి పీకే సలహా ఇచ్చినా ఇండియా కూటమిలోకి వెళతారా..?
ఇప్పటికే బీజేపీని తిట్టి చాలా పెద్ద పొరపాటు చేసి.. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ అపోజిషన్ గ్రూపులో చేరిపోతారా.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలసి పనిచేస్తారా అన్నది చూడాలి. ఈ పొత్తుల గందరగోళంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి పోటీ చేస్తుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.