REVANTH REDDY: శభాష్‌ రేవంత్‌.. చంద్రబాబు శుభాకాంక్షలు..

రేవంత్ రెడ్డితోపాటు.. మరో 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి.. పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. రేవంత్‌కు సోషల్ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 05:36 PMLast Updated on: Dec 07, 2023 | 5:36 PM

Chandrababu Naidu Wishes To Revanth Reddy On Social Media

REVANTH REDDY: తెలంగాణ మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు.

REVANTH REDDY: సీఎంగా రేవంత్.. ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే..

ఐతే వాళ్లెవరూ రాలేదు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు.. మరో 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి.. పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. రేవంత్‌కు సోషల్ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌కు.. హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసిన చంద్రబాబు.. ప్రజలకు సేవలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. నిజానికి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబుకు కూడా ఆహ్వానం వెళ్లింది. ఐతే కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు. రేవంత్‌ రెడ్డి టీడీపీలోనే రాజకీయ ఓనమాలు దిద్దారు. చంద్రబాబు, రేవంత్‌ది గురుశిష్యుల బంధం అని పేరు ఉంది.

నిజానికి తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండటం వెనక కూడా రేవంత్‌ వ్యూహమే కారణమనే చర్చ ఉంది. ఐతే రేవంత్‌ను సీఎంగా ప్రకటించిన వెంటనే నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఇంకా లోకేశ్‌ నుంచి రియాక్షన్ పెండింగ్‌ ఉంది. ఏమైనా రేవంత్‌ గురించి చంద్రబాబు చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అయింది.