Chandrababu Naidu: బాబు బెయిల్ రద్దవుతుందా..? హైకోర్టు తీర్పుపై టెన్షన్..!
చంద్రబాబు మీడియాతో మాట్లాడవద్దనీ.. భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని సీఐడీ పిటిషన్‌లో కోరింది. కానీ బాబు బయటకు వచ్చాక.. రాజమండ్రి జైలు దగ్గర గుమికూడిన జనంతో మాట్లాడారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను హైకోర్టుకు సబ్మిట్ చేశారు CID అధికారులు.
Chandrababu Naidu: ఆరోగ్య కారణాలతో జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ క్యాన్సిల్ అవుతుందా..? ఇప్పుడు టీడీపీ సర్కిల్స్‌లో ఇదే టెన్షన్ నడుస్తోంది. బాబుకు ఏపీ హైకోర్టు (AP HIGH COURT) పెట్టిన షరతులు ఉల్లంఘించారనీ.. అందుకే ఆయన నెలాఖరు దాకా కాదు.. ఇప్పుడే మళ్ళీ జైలుకు పోక తప్పదని వైసీపీ (YSRCP) నేతలు చెబుతున్నారు. అటు సీఐడీ (CID) కూడా ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో కేసు వేసింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. శుక్రవారం తీర్పు చెబుతానంది.
హెల్త్ రీజన్స్‌తో బయటకు వచ్చిన చంద్రబాబుకు అసలు జైలు పెట్టిన షరతులు ఏంటి..? ఆయన ఇప్పుడు ఏం నేరం చేశారు అంటే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకున్న అనారోగ్య పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని.. ఏపీ హైకోర్టు కండీషన్స్‌తో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబు మీడియాతో మాట్లాడవద్దనీ.. భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని సీఐడీ పిటిషన్‌లో కోరింది. కానీ బాబు బయటకు వచ్చాక.. రాజమండ్రి జైలు దగ్గర గుమికూడిన జనంతో మాట్లాడారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను హైకోర్టుకు సబ్మిట్ చేశారు CID అధికారులు. మీడియతో మాట్లాడవద్దని కోర్టు చెప్పినా బాబు ఉల్లంఘించారని వాదించారు. అంతేకాదు.. భారీ ర్యాలీలు తీయొద్దని చెబితే చంద్రబాబు 13 గంటల పాటు రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి ర్యాలీగా చేరుకున్నారని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యంతర బెయిల్ వచ్చిన ఫస్ట్ డేనే బాబు ఇలా నిబంధనలు ఉల్లంఘించారనీ.. అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందేనని సీఐడీ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు.
అయితే బాబు జనంతో మాట్లాడటం.. ఆయన ప్రాథమిక హక్కు అని, గతంలో అనేక కోర్టులు కూడా ఇలాంటి హక్కును కల్పించాయి అని వాదించారు బాబు తరపు న్యాయవాదులు. ప్రజలకు కృతజ్ఞతలు చెబితే.. అది దర్యాప్తుపై ఎలా ప్రభావం చూపిస్తుందో సీఐడీ అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. అయితే రెండు పక్షాలు వాదనలు బుధవారం పూర్తయ్యాయి. ఇప్పుడు ఏపీ హైకోర్టు బాబు బెయిల్ క్యాన్సిల్ చేస్తుందా.. లేదా అన్నది శుక్రవారం నాడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు.. కంటికి ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ టైమ్‌లో ఒక వేళ బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్ళల్లో టెన్షన్ కనిపిస్తోంది.