చంద్రబాబు, పవన్ టూర్ క్యాన్సిల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసరావు పేట పర్యటన రద్దు అయింది. భారీ వర్షం కారణంగా అధికారులు పర్యటన రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసరావు పేట పర్యటన రద్దు అయింది. భారీ వర్షం కారణంగా అధికారులు పర్యటన రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నరసరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవం కార్యక్రమంలో ఈ ఇద్దరూ పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షం, సభా ప్రాంగణం బురదమయంతో పర్యటనకు ఆటంకం ఏర్పడింది.
పరిసర ప్రాంతాలు బురదమయం కావడంతో వాహనాల పార్కింగ్కు అవస్థలు ఏర్పడ్డాయి. మరోచోట కార్యక్రమానికి ప్రత్యామ్నాయాలు చూసారు అధికారులు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు చేసుకోవడమే మంచిదనే భావించిన అధికారులు పర్యటనను రద్దు చేసారు. ఈ రోజు అంతా వర్షం పడే అవకాశం ఉండటంతోనే రద్దు చేయాలని అధికారులు భావించారు.