Chandrababu Poojalu: చంద్రబాబు ఎందుకిలా మారిపోయారు ?

ఆయనకు రాజకీయాలే జీవితం. నిత్యం రాజకీయాలే ఆలోచనగా.. ఊపిరిగా ఉండే చంద్రబాబు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు. జైలు నుంచి రీలిజ్‌ అయ్యాక వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తన ఇంట్లో యాగాలు.. హోమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు ఎందుకు ఆధ్యాత్మిక బాట ఎందుకు పట్టారు..? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 11:01 AMLast Updated on: Dec 23, 2023 | 11:47 AM

Chandrababu Poojalu

Chandrababu Naidu: ఒకప్పుడు దైవం.. శకునం.. ముహూర్తాలను అంతగా పట్టించుకోని  చంద్రబాబులో కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది. గత 15 ఏళ్ల నుంచి దేవుళ్ల మీద నమ్మకం..ముహుర్తాల మీద గురి పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు దైవం.. శకునం.. ముహూర్తం అనే వాటిని అంతగా పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు వాటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. 2004 ముందున్న చంద్రబాబు వేరు.. ఆ తర్వాత చంద్రబాబు వేరు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు.. అంతకు ముందు చంద్రబాబుకు పెద్దగా దేవుళ్ల మీద.. ముహుర్తాల మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు. మంచి పని చేయాలంటే దానికి ముహూర్తం ఎందుకు..? మంచి చేస్తున్నప్పుడు కూడా ఆలోచన చేయాలా..? అనే రీతిలో టీడీపీ (TDP) అధ్యక్షుడి ఆలోచనలు ఉండేవి. చంద్రబాబు ఆలోచన తీరును.. వ్యవహర శైలిని అప్పట్లో చూసిన వారు ఆయనకు అస్సలు దేవుళ్ల మీద నమ్మకం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ 2004 నుంచి చంద్రబాబులో కొద్ది కొద్దిగా మార్పు స్టార్ట్‌ అయింది. గత 15 ఏళ్ల నుంచి దేవుళ్ల మీద నమ్మకం.. ముహుర్తాల మీద గురి కుదిరింది. దీంతో చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది కదా..? అందుకే భక్తి పెరుగుతోందని కొంతమంది జోక్ చేసే వారు.

చంద్రబాబు తన కోసమో. తన కుటుంబం కోసమో.. అధికారం కోసమో.. యజ్ఞాలు.. యాగాలు గతంలో ఎక్కడా చేయలేదు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు కన్పిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యాక చంద్రబాబు పూర్తిగా భక్తి బాట పట్టి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. పరిస్థితులు మారాయి.. దైవ బలం ఉండాల్సిందేననే భావన టీడీపీ అధినేతలో పెరిగినట్టుగా కన్పిస్తోంది. దైవ సంకల్పం కూడా ఉంటే మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో పుణ్యక్షేత్రాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకన్న, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, సింహాచలం అప్పన్న ఆలయాలను దర్శించుకున్నారు. శ్రీ పెరంబుదూరు వెళ్లి రామానుజాచార్యుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. శ్రీశైలం కూడా త్వరలోనే వెళ్లనున్నారు.

ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారనే అంశంపై చర్చ జరగడానికి కారణాలు లేకపోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన నివాసంలోనే యాగం చేపట్టారు. ఉండవల్లిలోని నివాసంలో మూడు రోజుల పాటు హోమాలు.. యాగాలు.. పూజలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు, భువనేశ్వరి (Chandrababu, Bhuvaneswari) దంపతులు. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం, సుదర్శన నారసింహా హోమం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్థం, శత్రు సంహరం ఈ యాగాలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

యాగాలు, యజ్ఞాలకు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులర్. ఎన్ని రాజకీయ వ్యూహాలు వేసినా… ఎత్తులకు పై ఎత్తులు వేసినా…ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు తెచ్చుకున్న… పూజలు… పూజలే… యాగాలు యాగాలే…. ఆ విషయంలో కెసిఆర్ ఎక్కడ రాజీపడేవారు కాదు. కెసిఆర్ మూడుసార్లు రాజ శ్యామల యాగం చేశారు. చండీ యాగం కూడా చేశారు. కెసిఆర్ పూజలు, యాగాలు ప్రభావం చంద్రబాబుపై కూడా పడినట్లు ఉంది. మానవ కృషికి తోడు దైవ సంకల్పం కూడా ఉండాలని థియరీని బాబు నమ్ముతున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో గెలవాలంటే తన శక్తిసామర్థ్యాలతో పాటు యాగాలు పూజలు కూడా అవసరమని భావిస్తున్నట్లున్నారు.