వాళ్లకు బలుపు, బెనిఫిట్ షోస్ వద్దు, పవన్ కు చంద్రబాబు క్లారిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచుకునే విషయంలో సినిమా పరిశ్రమకు ఇప్పటికే పక్కా క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రకటన విషయంలో ఒక్క అడుగు కూడా వెనక పడదని కాబట్టి సినిమా టికెట్ ధరల విషయంలో కానీ బెనిఫిట్స్ లో విషయంలో కానీ ఎక్కువ ఊహించుకోవద్దంటూ గురువారం జరిగిన సమావేశంలో సినిమా వాళ్లకు తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2024 | 02:57 PMLast Updated on: Dec 28, 2024 | 2:57 PM

Chandrababu Ready To Gave A Shock To Tollywood

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచుకునే విషయంలో సినిమా పరిశ్రమకు ఇప్పటికే పక్కా క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రకటన విషయంలో ఒక్క అడుగు కూడా వెనక పడదని కాబట్టి సినిమా టికెట్ ధరల విషయంలో కానీ బెనిఫిట్స్ లో విషయంలో కానీ ఎక్కువ ఊహించుకోవద్దంటూ గురువారం జరిగిన సమావేశంలో సినిమా వాళ్లకు తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని పైన సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు అత్యంత కీలకంగా మారాయి. తొలి రోజు వచ్చే భారీ వసూళ్లతోనే సినిమా ఫ్యూచర్ కలెక్షన్లు డిపెండ్ అయి ఉంటున్నాయి. ఇప్పుడు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనే భయం సినిమా పరిశ్రమలో ఉంది. నిన్న రేవంత్ రెడ్డికి ఇదే విషయం చెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఒప్పుకునే అవకాశం లేదు అనే క్లారిటీ స్లోగా వస్తుంది. దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో సినిమా పరిశ్రమ అడుగు పెట్టాలని ఎన్నోసార్లు కోరారు. అయినా సరే సినిమా పరిశ్రమ పెద్దలు మాత్రం ఏపీ రావడానికి ఇష్టపడలేదు. ఇక 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడింది. ఈ సమయంలో సినిమా వాళ్లు వ్యవహరించిన శైలి కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక 2023లో చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న సమయంలో సినిమా వాళ్ళ నుంచి కనీస రెస్పాన్స్ లేదు.

చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా ఆయన అరెస్టుని ఖండించే ప్రయత్నం చేయలేదు. దేశవ్యాప్తంగా సంచలమైన అరెస్టు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధి పొందిన వాళ్లు కూడా సైలెంట్ గా ఉండటం చాలా మందిని షాప్ కి గురిచేసింది. దీనితో ఇప్పుడు అది మనసులో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అసలు టికెట్ ధరలను పెంచే విషయంలో వెనకడుగు వేసేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద కూడా తేల్చి చెప్పినట్టు టాక్. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమా వాళ్ళ విషయంలో అంత కంఫర్టబుల్గా లేరు అనేది తెలుస్తోంది. ఏపీ రాకపోతే టికెట్ ధరల విషయంలో కానీ బెనిఫిట్ షోలో విషయంలో కానీ తాము ఏమీ చేయలేం అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పడానికి కూడా రెడీ అవుతున్నారు.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏం జరగబోతోంది అనేది సినిమా వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం బెనిఫిట్ షోల విషయంలో గాని టికెట్ ధరల విషయంలో గాని ఎటువంటి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. సినిమా వాళ్లు మనకు సహకరించినప్పుడు మనం సహకరించాల్సిన అవసరం ఏముందని… సోషల్ మీడియాలో ప్రశ్నలు వినపడుతున్నాయి. అలాగే సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రానప్పుడు వాళ్ల కోసం నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలని… సినిమా పరిశ్రమకు మేజర్ కలెక్షన్లు వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి అసలు వెనక్కి తగ్గవద్దంటూ చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నారు.