జగన్ ధైర్యం చూసి మైండ్ పోతుంది: చంద్రబాబు
ప్రజాస్వామ్యం లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అన్నట్టు రుషికొండ భవనాలు ఉన్నాయని సిఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. విలాసవంతమైన జీవితం కోసం ఒక వ్యక్తి చేసిన నిర్వాకం చూసి మైండ్ పోతోందన్నారు.
ప్రజాస్వామ్యం లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అన్నట్టు రుషికొండ భవనాలు ఉన్నాయని సిఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. విలాసవంతమైన జీవితం కోసం ఒక వ్యక్తి చేసిన నిర్వాకం చూసి మైండ్ పోతోందన్నారు. ఇంత నేరాలు చేయాలంటే ధైర్యం ఉండాలని… అధికారం అడ్డంపెట్టుకుని చేసే తప్పులకు ఇదొక కేస్ స్టడీ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని తీర్పు ఇచ్చారన్నారు. నేను చాలా దేశాలు తిరిగాను, పర్యావరణాన్ని ధ్వంసం చేసి సీఎం విలాసాల కోసం భవనాలు కట్టారన్నారు.
చంద్రగిరి ప్యాలెస్ లాంటివి ఉండేవి కానీ అవి సింబాలిక్ గా ఉండేవి, కానీ ఇక్కడ మళ్ళీ కొత్త ప్యాలెస్ లు కట్టారన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఋషికొండలాంటి కట్టడాలు జరుగుతాయఅని ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు చంద్రబాబు. కలలో కూడా ఊహించలేదు… ఇలాంటి కట్టడాలు కడతారని అనవసరంగా తన స్వార్థం కోసమే ఈ నిర్మాణాలు జరిగాయని మండిపడ్డారు. ఈ నిర్మాణాలు చూస్తే మైండ్ బ్లో అయిందన్నారు.
చెదిరిపోయే నిజాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి కట్టాలంటే అన్నిటికీ తెగిస్తే తప్ప ఇలాంటి ధైర్య సాహసాలు చేయలేమన్నారు. బయట ప్రపంచం కోడై కోస్తున్నప్పటికీ మీడియా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాన్ని రానివ్వకుండా ఈ నిర్మాణాలు జరిగాయి అన్నారు చంద్రబాబు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొంతమంది వెళ్లారని హైకోర్టుకు వెళ్లారు కేంద్రం జోక్యం చేసుకుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఈ నిర్మాణం చేశారని ఆయన ఆరోపించారు.