చెప్తే అర్ధం కాదా… పూలు ఎందుకు…? అధికారులపై చంద్రబాబు ఫైర్…!
ఈ మధ్య కాలంలో ఏపీ సిఎం చంద్రబాబు వైఖరి అధికారుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్న మాట వాస్తవం. చిన్న తప్పు కనపడినా ఆయన అధికారులపై సీరియస్ అయిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో ఏపీ సిఎం చంద్రబాబు వైఖరి అధికారుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్న మాట వాస్తవం. చిన్న తప్పు కనపడినా ఆయన అధికారులపై సీరియస్ అయిపోతున్నారు. కొల్లేరు ముంపు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సిఎం చంద్రబాబు… అధికారులు చేసిన ఓ పనిపై సీరియస్ అయ్యారు. కైకలూరు ప్రాంతంలో మునిగిన పంటపొలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి… అనంతరం ఏలూరులో క్షేత్రస్థాయి పర్యటన చేసారు. తమ్మిలేరు బ్రిడ్జి వద్ద వరదను కూడా పరిశీలించారు.
సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో అధికారులు, వరద బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. కాలేజ్ ఆడిటోరియంకు జిల్లా అధికారులు పూలతో అలంకరణ చేయడంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలపై సమీక్షలకు అలంకరణలు ఏంటని అధికారులను నిలదీశారు. తన పర్యటనలకు హంగులు, హడావుడి వద్దు అని ఎన్ని సార్లు చెప్పినా యంత్రాంగం అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసారు. సాధ్యమైనంత సింపుల్ గా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలనే తన ఆలోచను అధికారులు తప్పక ఆచరించాలని స్పష్టం చేసారు.