సింగ్ నగర్ లో జగన్ ఐపిఎస్ లు, చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారా…?

విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సిఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్న సమయంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సిఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2024 | 04:21 PMLast Updated on: Sep 02, 2024 | 4:21 PM

Chandrababu Serious On Ips Officer

విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సిఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్న సమయంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సిఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో చర్చ జరిగింది. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం అని ఓ మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు.

జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైసిపీ కి అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దుశ్యపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామని చంద్రబాబుకు తెలిపారు. అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా తనపరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మరీ సిఎంకు మంత్రి ఇచ్చారు. విఆర్ లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకి డిఎస్పీ నుంచి డిఐజీ స్థాయి అధికారులు వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం విఆర్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులకు అక్కడ డ్యూటీలు వేసారు. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సిఎం….ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విఆర్ లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలపగా… పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని…ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని అసహనం వ్యక్తం చేసారు.