Top story: లిక్కర్, ఇసుక టార్గెట్… ఏపీలో 70 మంది ఎమ్మెల్యేల పైసా వసూల్

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా నిండలేదు. ఖజానాలో రూపాయి లేక చంద్రబాబు అండ్ టీం దిక్కులు చూస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం హై స్పీడ్ తో వసూలు మొదలుపెట్టారు. లిక్కర్ షాపులు, ఇసుక టార్గెట్ గా పెట్టుకొని ఓపెన్ గానే దందాలు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2024 | 03:11 PMLast Updated on: Oct 18, 2024 | 3:11 PM

Chandrababu Serious On Own Party Mlas

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా నిండలేదు. ఖజానాలో రూపాయి లేక చంద్రబాబు అండ్ టీం దిక్కులు చూస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం హై స్పీడ్ తో వసూలు మొదలుపెట్టారు. లిక్కర్ షాపులు, ఇసుక టార్గెట్ గా పెట్టుకొని ఓపెన్ గానే దందాలు చేస్తున్నారు. ఇలాంటి 20 మంది ఎమ్మెల్యేల ఆడియో రికార్డులు సీఎం చంద్రబాబు దగ్గరికి చేరాయి. అయినా సరే డోంట్ కేర్ అంటున్నారు ఎమ్మెల్యేలు.70 మందికి పైగా ఎమ్మెల్యేలు లిక్కర్ టెండర్లు, ఇసుకలో జోక్యం చేసుకొని వసూలు మొదలెట్టారు.

లిక్కర్ టెండర్లు జోలికి వెళ్లొద్దు. ఇసుక లో వేలు పెట్టొద్దు. నాకు కొందరి వ్యవహారాలు తెలుస్తున్నాయి. వాళ్ల సంగతి తేలుస్తాను…. అంటూ చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలు అందరికీ పబ్లిక్ గా వార్నింగ్ ఇస్తున్నప్పటికీ… ఎవ్వరు ఎక్కడ తగ్గటం లేదు.50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం. ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చోవాలంటే ఎలా సాధ్యం అవుద్ది? పది రూపాయలు వెనకేసుకొద్దా? గడచిన ఐదేళ్లు రూపాయి ఆదాయం లేదు. వైసిపి వాళ్ళు పిండేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమీ చేయొద్దు అంటే…. మరి మేము ఎలా బతకాలి..?.. ఇవన్నీ టిడిపి, జనసేన ,బిజెపి ఎమ్మెల్యేలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్న మాటలు.

ఏపీలో లిక్కర్ షాపుల లాటరీలో ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా పాల్గొనక పోయిన, కుటుంబ సభ్యులు, అనుచరులు చేత టెండర్లు వేయించి వాటిని కైవసం చేసుకున్నారు. మరికొన్నిచోట్ల నియోజకవర్గంలో ప్రతి బ్రాందీ షాప్ కి రోజుకి మాకు ఇంత కమిషన్ కట్టాలి అని రేటు పెట్టేశారు ఎమ్మెల్యేలు. మొదటిరోజు షాపులు ఓపెన్ చేయ నివ్వకుండా…. మొదట ఎమ్మెల్యే నీ వచ్చి కలవాలని ఆదేశాలు జారీ చేశారు నరసరావుపేటలో మద్యం దుకాణాల లాటరీ గెలుచుకున్న ముగ్గురు బార్ యజమానులను ఎమ్మెల్యేని కలవాలని వ్యవహారం సెటిల్ చేసుకోవాలని పోలీసులే హుకుం జారీ చేశారు. మాట వినని ఓ బార్ ముందు ఏకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇది కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కాదు ఏపీలో దాదాపు 100 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.

చిత్తూరు, ఉభయగోదావరి, గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు లిక్కర్ షాపు ఓనర్లను బెదిరించినట్లు చంద్రబాబుకు సమాచారం అందింది. పోలీస్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసిన నిఘాలో 24 మంది ఎమ్మెల్యేల ఆడియోలు దొరికాయి. అవి నేరుగా చంద్రబాబుకే చేరాయి. దీనిపై ముఖ్యమంత్రి చాలా ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని…. మొదట పిలిచి వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే క్యాబినెట్ సమావేశం అవగానే జరిగిన ప్రెస్ మీట్ లో నేరుగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి, ఏకంగా ప్రతి పనిలో తనకు 15 పర్సెంట్ కమిషన్ ఇవ్వాలని, మరో 15% తాను ఇన్వెస్ట్మెంట్ పెడతానంటూ… మొత్తం 30% కి టార్గెట్ చేసి కాంట్రాక్టర్లను బహిరంగంగానే బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్లో సుమారు 70 మంది టిడిపి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు మద్యం ఇసుక వ్యాపారాల్లో వేళ్ళు ….కాళ్లు పెట్టేశారు. మద్యం ,ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్లు డోంట్ కేర్ అంటున్నారు. ముఖ్యమంత్రిని కూడా పరోక్షంగా తిడుతూ…. ఎలక్షన్స్ లో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టాం… అవన్నీ వాళ్ళ బాబు ఇస్తాడా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా 24 మంది ఎమ్మెల్యేల ఆడియోలు చంద్రబాబు దగ్గరికి చేరాయి. వీటి వ్యవహారం తేల్చడానికి త్వరలోనే ఎమ్మెల్యేలు ఎంపీల మీటింగ్ పెట్టబోతున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కానీ, బంధువులు గాని మద్యం, ఇసుక వ్యవహారాల్లో తలదూర్చవద్దని మరోసారి గట్టిగా చెప్పబోతున్నారు. అలాగే ఆడియోలు దొరికిన, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను వన్ టూ వన్ కూర్చోబెట్టి… విడివిడిగా ఒక్కొక్కరికి క్లాసులు పీకబోతున్నారు చంద్రబాబు.

ఏపీలో జగన్, వైసిపి రెండు ఈ లిక్కర్, ఇసుక వల్లే మొన్నటి ఎన్నికల్లో నాశనం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీ నేతలు అంతా అదే పొరపాటు చేస్తే మనకి అదే గతి పడుతుందని చెప్పబోతున్నారు. కూటమిలో మొత్తం 24 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుందని, వాళ్ల విషయం తేల్చాలను కుంటున్నానని చంద్రబాబు సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇలాగే వదిలేస్తే 2014 19 మధ్య జరిగిన తప్పులే పునరావృతం అవుతాయని కొందరు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఏ మద్యం, ఇసుక అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ని, పార్టీని, జగన్ని అబాసపాలు చేశాయో అదే మద్యం, ఇసుక టిడిపిని ని కూడా దెబ్బతీస్తాయని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కానీ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటని లెక్క చేయడం లేదు. ఒక్కసారి ఫీల్డ్ కొచ్చి చూస్తే తెలుస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఇప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోమంటే ఎలా? పైన… వాళ్ళు సంపాదించుకోవట్లేదా? మరి మీరు సంపాదించుకోనక్కర్లేదా అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మిత్రులు, బంధువులతో బినామీ పేర్లపై లిక్కర్ షాపులు కలిసిన చేసుకున్నారు. మరికొందరు ప్రతి షాపు నుంచి రోజుకి ఎంతని వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పరిస్థితి చూస్తుంటే లిక్కర్, ఇసుక ఏపీలో చంద్రబాబు కొంప ముంచేటట్లే ఉన్నాయి.