కల్తీ నెయ్యి: చంద్రబాబు సంచలనం
కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయన ప్రస్తుతం గుంటూరు రేంజ్ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. లడ్డు కల్తీ వ్యవహారంతో పాటుగా తిరుమల ప్రసాదంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణ జరుపనుంది.
సోమవారం సాయంత్రం డీజీపీతో చంద్రబాబు భేటీ, నేడు మరోసారి ఉన్నతాధికారులతో భేటీ అయిన చంద్రబాబు… డీజీపీకి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అధికారులు ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపై సూచనలు చేసారు. దీనితో ముగ్గురు ఐపిఎస్ సభ్యుల బృందంతో విచారణకు ఆదేశించారు. సీట్ డిఐజిగా విశాఖ రేంజ్ డిఐజి గోపి నాథ్ జెట్టి వ్యవహరిస్తారు. సీట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉంటారు.