మంత్రికి లైవ్ లో బాబు వార్నింగ్
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జరుగుతున్న నేరాలపై ఆయన స్పందించారు. గంజాయి మత్తుగాళ్ళకు వదిలే ప్రసక్తి లేదు.. ఎవరికైనా మత్తెక్కితే ఒళ్ళు వణికేలా చేస్తాం అని ఆయన హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జరుగుతున్న నేరాలపై ఆయన స్పందించారు. గంజాయి మత్తుగాళ్ళకు వదిలే ప్రసక్తి లేదు.. ఎవరికైనా మత్తెక్కితే ఒళ్ళు వణికేలా చేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఆడబిడ్డలు విలాస వస్తువులు కాదు.. అలా ఆలోచిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఎప్పటికక్కడ సీసీ కెమెరాలు పెట్టి.. మక్కలు ఇరగదిస్తామన్నారు. ఐదేళ్లలో పేదలందరికీ ఇళ్లు.. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు.. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసారు.
గాడి తప్పిన పాలన సరిదిద్దుతున్నాను అన్నారు ఆయన. ఆర్ అండ్ బి మంత్రి, సెక్రటరికి చెప్తున్నా… సంక్రాంతికి రోడ్లపై డ్రోన్లు పంపిస్తా.. అప్పటికి రోడ్లన్నీ గుంతలు లేకుండా కనిపించాలన్నారు. జనవరిలో పండక్కి వచ్చిన వాళ్లంతా రాష్ట్రంలో చూసి గర్వపడేలా ఉండాలన్నారు. రోడ్లపై నాలుగో గేరులో వాహనాలు వెళ్లాలి గాని.. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ కి వెళ్ళకూడదని స్పష్టం చేసారు. రతన్ టాటా స్ఫూర్తితో.. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం.. ఆ దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాం.. మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు.