Chandrababu : కాసేపట్లో బయటికి రానున్న చంద్రబాబు.. భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ నేతలు..
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదల కాబోతున్నారు. స్కిల్ స్కాంలో ఆయనకు వచ్చి బెయిల్ ఆర్డర్ కాపీ ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరింది. ఆర్డర్ కాపీలోని కండీషన్స్‌ను చంద్రబాబుకు పోలీసులు చదివి వినిపించిన తరువాత ఆయన జైలు నుంచి బయటికి వస్తారు.

Chandrababu who will come out soon TDP leaders made huge arrangements
స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు..
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదల కాబోతున్నారు. స్కిల్ స్కాంలో ఆయనకు వచ్చి బెయిల్ ఆర్డర్ కాపీ ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరింది. ఆర్డర్ కాపీలోని కండీషన్స్‌ను చంద్రబాబుకు పోలీసులు చదివి వినిపించిన తరువాత ఆయన జైలు నుంచి బయటికి వస్తారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నారా లోకేష్ బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నారు. 52 రోజుల తరువాత చంద్రబాబు బయటికి వస్తుండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లబోతున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన జెడ్ ప్లస్ కాన్వాయ్ రాజమండ్రికి చేరుకుంది. బాబును ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నేతలు రూట్‌మ్యాప్ రెడీ చేశారు.
రాజమండ్రి నుంచి చంద్రబాబు నేరుగా కార్యకర్తలను పార్టీ నేతలను కలుస్తూ వేమగిరి, రావులపాలెం, తణుకు మీదుగా తాడేపల్లిగూడెం చేరుకుంటారు. దుందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, నుంచి బాబు కాన్వాయ్ గన్నవరం చేరుకుంటుంది. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్, కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈ రూట్ మ్యాప్‌లో ప్రతీ ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులను కలిసేవిధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి 9 లోపు చంద్రబాబు ఇంటికి చేరుకునేలా రూట్‌మ్యాప్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చంద్రబాబు వెళ్తారు. అటు నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం ఏఐజీ హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. పూర్తిగా కోలుకునేవరకూ అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటారు.