YCP in-charges : జనవరి 1లోగా వైసీపీ ఇన్‌చార్జిల మార్పు .. 60 స్థానాల్లో కొత్తముఖాలకు ఛాన్స్?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేసారు. గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ అధినేత జగన్. మరిన్ని స్థానాలకు ఇంచార్జీలను ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం జగన్. ఇప్పటికే 11 స్థానాలకు ఇంచార్జిల మార్పుతో మొదటి జాబితా ప్రకటించారు. మలివిడత జాబితా కోసం కసరత్తు జరుగుతోంది. మొదటి లిస్ట్ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశమయ్యారు సీఎం జగన్. సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వివరిస్తూ… సర్వే నివేదికలను అభ్యర్ధుల ముందుంచారు. పార్టీ అధికారంలోకి రాగానే సీటు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పుకొస్తున్నారు. వారం క్రితమే రెండో లిస్ట్ విడుదలవుతుందని అందరూ భావించినా.. కాస్త ఆలస్యమైంది. బుధవారం తాడేపల్లి కేంద్రంగా కీలక సమావేశాలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అభ్యర్ధుల ఎంపికపైనే సీఎం ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
ఇలా క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన వారిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, కొట్టు సత్యనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దా రెడ్డితో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఉన్నారు. సీఎం నిర్ణయం ఎలా ఉన్నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాను మాత్రం నియోజకవర్గం అభివృద్ది పై చర్చించేందుకే క్యాంపాఫీస్ కు వచ్చానన్నారు ధర్మశ్రీ.. తనకు చోడవం టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
గురువారం కూడా సీఎం క్యాంపాఫిసుకు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు క్యూలు కట్టారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయంటున్నారు పార్టీ సీనియర్లు. 175 సీట్లు విజయం సాధించాలంటే మార్పులు తప్పదని చెబుతున్నారు.