ఆ జిల్లాపై రేవంత్ స్పెషల్ లవ్

రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రేవంత్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 01:38 PMLast Updated on: Nov 20, 2024 | 1:38 PM

Chief Minister Revanth Reddy Showered Blessings On Rajanna Sircilla District

రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రేవంత్. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేయనున్నారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు .

రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు , రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి… రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేస్తారు.

మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించనున్నారు సీఎం. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు. అలాగే 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు.