నా తమ్ముడ్ని అడుక్కోవాలా…? ఎక్కడికి వెళ్ళను… అరవింద్ కు మెగాస్టార్ షాక్

మెగా ఫ్యామిలీలో విభేదాలు మరోసారి పీక్స్ కి వెళ్ళాయి. సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగా ఫ్యామిలీలో పెద్దయుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా సీరియస్ గా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2024 | 07:39 PMLast Updated on: Dec 28, 2024 | 7:39 PM

Chiranjeevi Angry On Allu Arjun

మెగా ఫ్యామిలీలో విభేదాలు మరోసారి పీక్స్ కి వెళ్ళాయి. సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగా ఫ్యామిలీలో పెద్దయుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా సీరియస్ గా ఉన్నారు. రామ్ చరణ్ సినిమా, తన సినిమా రిలీజ్ ఉన్న సమయంలో ఇలా జరగటాన్ని చిరంజీవి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చేసిన ప్రకటన విషయంలో వెనక్కి తగ్గకపోవడం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో క్లారిటీ లేకపోవడంతో చిరంజీవి సీరియస్ అవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పెద్దల భేటీ తర్వాత చిరంజీవిని అల్లు అరవింద్ కలిశారు. ఆ భేటీలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలకు సంబంధించి ఆయనతో చర్చించారు. అయితే ఈ డిస్కషన్ లో చిరంజీవి సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోవచ్చు అనే ఒపీనియన్ ను చిరంజీవి.. అల్లు అరవింద్ ముందు బయటపెట్టారు. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ తో మీరు మాట్లాడాలని చిరంజీవిని కోరగా దానికి చిరంజీవి నో చెప్పినట్లు సమాచారం.

గతంలోనే సినిమా వాళ్ల గురించి తాను జగన్ ను కలిశానని ఇక తాను ఎవరిని కలవాలి అనుకోవట్లేదని ఏం జరగాలంటే అదే జరుగుతుందని తేల్చి చెప్పారట చిరంజీవి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడమని అయితే సినిమా వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు అని కాబట్టి అనవసరంగా వెళ్లి విలువ తగ్గించుకున్నట్లు ఉంటుంది అన్నారట చిరంజీవి. దీనితో ఇప్పుడు అల్లు అరవింద్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.

అటు దిల్ రాజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన పెద్దగా ఉపయోగ ఉండకపోవచ్చు అనేది కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని దిల్ రాజు కూల్ చేయలేకపోయారని సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే అటు ప్రజల్లో కూడా అనవసరంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు సాహసం చేయకపోవచ్చు అని భావిస్తున్నారు. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే పని జరిగే అవకాశం ఉంటుంది. కానీ గతంలో చిరంజీవి వైయస్ జగన్ ను కలిసిన సమయంలో ఆయన స్థాయి తగ్గించుకున్నారు అనే ఆరోపణలు మెగా ఫాన్స్ లోనే అనిపించాయి. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి వద్దకు కూడా వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో భేటీ కూడా ఆయన వెళ్లే అవకాశాలు లేవనే చెప్పాలి.