చిరంజీవి వ్యూహం అదుర్స్… రేవంత్ ను కూల్ చేసే ప్లాన్ రెడీ…
తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సినిమా పరిశ్రమ నుంచి సరైన గుర్తింపు లేదు అనే విషయంలో చాలామంది క్లారిటీ ఉంది.
తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సినిమా పరిశ్రమ నుంచి సరైన గుర్తింపు లేదు అనే విషయంలో చాలామంది క్లారిటీ ఉంది. అయితే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సినిమా పరిశ్రమను సీరియస్ గానే తీసుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి సినిమా పరిశ్రమ రెడీ అవుతోంది. త్వరలో జరగబోయే గేమ్ చేంజర్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి అనే ఆహ్వానించాలని ఆ సినిమా నిర్మాతలు అలాగే మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు.
గతంలో మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో ఆయనను పదేపదే అనేక ఈవెంట్లకు సినిమా పరిశ్రమ ఆహ్వానించింది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం గుర్తింపు లేదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ అవకాశం వచ్చిన సరే వదిలిపెట్టడం లేదు. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమకు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ తగ్గించే పనిలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గేమ్ చేంజర్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపద్యంలో ఈ సినిమా ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమకున్న సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డిని దిల్ రాజు ఇప్పటికే కలిశారు. ఇక సినిమా వాళ్లు కూడా బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు ముఖ్యమంత్రి వద్ద చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ ను అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతోంది.
రాజమండ్రిలో నిర్వహించబోయే ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని రామ్ చరణ్ అలాగే దిల్ రాజు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. విజయవాడలో కూడా భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ముందు ప్లాన్ చేసినా ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే అమెరికాలో గ్రాండ్ గా జరిగింది. ఇక ప్రమోషన్స్ విషయంలో నార్త్ ఇండియాను ఎక్కువగా టార్గెట్ చేశారు. నార్త్ ఇండియాలో ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో అక్కడ కలెక్షన్స్ భారీగా రాబట్టాలని రామ్ చరణ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నోలో ఒక ఈవెంట్ను గ్రాండ్ గా చేసింది గేమ్ చేంజర్ సినిమా యూనిట్.