బ్రేకింగ్: 20 లక్షలు ఇవ్వకపోతే నీ బిడ్డల్ని చంపుతా, ఎమ్మెల్యేకే వార్నింగ్
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు. నిందితుడు కోసం కరీంనగర్ రూరల్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసారు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ ను ఎమ్మెల్యే సత్యం ఆన్సర్ చేసారు. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
కొత్తపల్లి పోలీసులకు ఎమ్మెల్యే సత్యం ఫిర్యాదు చేసారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానీనగర్ కు చెందిన 33 ఏళ్ల యాస అఖిలేష్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు.. లండన్ లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్టు ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు తెలిపారు.