CI Anju Yadav : రాజకీయాల్లోకి సీఐ అంజు యాదవ్.. వైసీపీ నుంచి టికెట్ కన్ఫార్మ్ !
అంజు యాదవ్ పేరు గుర్తుందిగా.. కొన్ని నెలల కింద శ్రీకాళహస్తిలో జనసేన నేత చెంప చెల్లుమనిపించిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందే తిరుగుతోంది. ఆ తర్వాత పవన్ అక్కడికి వెళ్లడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆమె వీడియోలు చాలా బయటకు వచ్చాయి.
అంజు యాదవ్ పేరు గుర్తుందిగా.. కొన్ని నెలల కింద శ్రీకాళహస్తిలో జనసేన నేత చెంప చెల్లుమనిపించిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందే తిరుగుతోంది. ఆ తర్వాత పవన్ అక్కడికి వెళ్లడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆమె వీడియోలు చాలా బయటకు వచ్చాయి. నడిరోడ్డు మీద తొడగొట్టిన వీడియోతో పాటు.. వైసీపీ ఎంపీపీని నిలదీసిన వీడియో కూడా వైరల్ అయింది. ఐతే ఇప్పుడు అంజు యాదవ్ మళ్లీ వైరల్ అవుతున్నారు. అంజు యాదవ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున మైదుకూరు టికెట్ కన్ఫార్మ్ అయినట్లు కూడా టాక్. అసెంబ్లీ ఎన్నికలకు జగన్ ఇప్పటి నుంచి రంగం సిద్ధం చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకంటుననారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ మార్పు మాత్రమే కాదు.. పక్కకు కూడా తప్పించే అవకాశాలు ఉంటాయని.. తన నిర్ణయాలతో చెప్పకనే చెప్తున్నారు. ఇప్పటికే 11మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు జగన్. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
నిజానికి ఈమె పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామవాసి! ఈమె భర్త నల్లబోయిన గంగాధర్‌యాదవ్ స్వగ్రామం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం, మానేరాంపల్లి గ్రామం. అందుకే అంజు యాదవ్ మైదుకూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. పైగా ఇక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయ్. బీసీ సామాజికవర్గం కూడా బలంగా ఉంది. గంగాధర్‌యాదవ్, అంజు యాదవ్ దంపతులకు నియోజవర్గం జనాలతో మంచి సంబంధాలు ఉన్నాయ్. వీరికి సొంతంగా కేడర్ కూడా ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే.. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో దిగబోతున్నారు. యాదవ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఢీకొట్టాలంటే.. అదే సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో అంజు యాదవ్ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తుండడంతో.. ఆమెకు టికెట్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంజు యాదవ్ మాత్రమే కాదు.. గతంలో సీఐగా ఉన్న మాధవ్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు జగన్.. ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.