జత్వాని కేసు… ఎంటర్ అయిన సిఐడీ
ముంబై సినీనటి జేత్వని కేసులో రంగం లోకి దిగారు సిఐడి అధికారులు. కొద్దిరోజుల క్రితం కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం కేసు బదిలీ చేసింది.

ముంబై సినీనటి జేత్వని కేసులో రంగం లోకి దిగారు సిఐడి అధికారులు. కొద్దిరోజుల క్రితం కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం కేసు బదిలీ చేసింది. పోలీసుల నుంచి కేసును పూర్తిగా టేక్ ఓవర్ చేసుకున్న సిఐడి… విచారణ వేగవంతం చేసింది. నేడు సిఐడి ముందు విచారణకు ముంబై సినీనటి జత్వాన్ని ఆమె తల్లిదండ్రులు హాజరు అయ్యారు. ముగ్గురి స్టేట్మెంట్స్ సిఐడి అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల గురించి కూడా ప్రశ్నించారు అని సమాచారం. ఐపీఎస్ అధికారుల ప్రమేయంతో పాటు కేస్ అసలు వాస్తవాలను సిఐడీ అధికారులు తేల్చనున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో త్వరలోనే అరెస్ట్ లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.