బిగ్ బ్రేకింగ్: మిథున్ రెడ్డి అరెస్ట్ కు ఢిల్లీలో సిఐడీ
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సిఐడి అధికారులు రంగం సిద్దం చేసారు. లిక్కర్ స్కాంలో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలో వస్తున్న నేపథ్యంలో..

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సిఐడి అధికారులు రంగం సిద్దం చేసారు. లిక్కర్ స్కాంలో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలో వస్తున్న నేపథ్యంలో.. సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఆయన పాత్రకు సంబంధించి పలు సాక్షాలను ఆధారాలను సేకరించిన సిఐడి అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో పార్లమెంట్లో ఎంపీ లావు కృష్ణదేవరాయల వ్యాఖ్యల తర్వాత మిధున్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు.
ఆయనకు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు డిస్మిస్ చేసిన వెంటనే సుప్రీంకోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డి నీ అదుపులోకి తీసుకునేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో సీరియస్ గానే ఉంది. ముఖ్యంగా 99 వేల కోట్ల లావాదేవీల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు వాటిపై కేంద్రం కూడా రంగంలోకి దిగింది.